P Krishna
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొంతమంది నేతలు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యంతో పాటు ఇంటి సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. అయితే అక్రమ రవాణాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొంతమంది నేతలు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యంతో పాటు ఇంటి సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. అయితే అక్రమ రవాణాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు.
P Krishna
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. మూడు ప్రధాన పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారాల్లో మునిగిపోయారు. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం కొనసాగిస్తుండగా… కాంగ్రెస్, బీజేపీ నుంచి జాతీయ నేతలు వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది రాజకీయ నేతలు డబ్బు, మద్యం, బంగారు, వెండితో పాటు ఇతర వస్తువులు ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తూ విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టివేస్తున్నాన్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది రాజకీయ నేతలు, వారి మద్దతు దారులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారలు వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఎక్కడో అక్కడ డబ్బు, వస్తువులు, మద్యం పట్టుబడుతుంది. వాటిని వెంటనే సీజ్ చేస్తున్నారు అధికారులు. తాజాగా హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు. ఆరు కార్లలో సూట్ కేసులు తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఈ నగదు మొత్తం రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కి సంబంధించిన డబ్బు అని అనుమానిస్తున్నారు. కాకపోతే దీనిపై ఖచ్చితనమైన నిర్ధారణకు పోలీసులు రాలేదు.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీగా నగదు పట్టి వేస్తున్న విషయం తెలిసిందే. గత నెల తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. అప్పటి నుంచి కొన్ని రాజకీయ పార్టీ నేతలు డబ్బు పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడ్డ నగదు, సొత్తు విలువ దాదాపు రూ.519 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఇందులో కేవలం నగదు రూ.177.32 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంటున్నారు.