iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన అక్రమంగా తరలిస్తున్న నగదు!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హాడావుడి నడుస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి..ముమ్మరంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సంఘం ముమ్మురంగా తనిఖీలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హాడావుడి నడుస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి..ముమ్మరంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సంఘం ముమ్మురంగా తనిఖీలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది.

హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన అక్రమంగా తరలిస్తున్న నగదు!

ప్రస్తుతం దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. అలానే అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో భారీ మొత్తంలో నగదు కూడా అక్రమంగా తరలి వెళ్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దేశ వ్యాప్తంగా ముమ్మురంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడా అక్రమంగా తరలిస్తున్న భారీగా నగదులు, మద్యం, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీగా నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హాడావుడి నడుస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి..ముమ్మరంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇలా ఎన్నికలు సమయంలో మనకు కనిపించే కోణం ప్రచారం, సభలు ఒకవైపు మాత్రమే. మరోవైపు భారీ ఎత్తున అక్రమంగా నగదు, మద్యం సరఫరా అవుతుంటాయి. ఇక ఈ అక్రమ నగదు సరఫరాను అరికట్టేందుకు ఎన్నికల సంఘం, అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అనుమానస్పదంగా కనిపించే వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అలానే పక్క సమాచారం.. అక్రమ నగదను దాచిన వారి ఇళ్లపై దాడులు చేసి.. స్వాధీనం చేసుకుంటున్నారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇలా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈక్రమంలోనే పెద్ద మొత్తంలో నగదును సీజ్‌చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని  కూకట్‌పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. కూకట్ పల్లి వాహనాల తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో నగదు సీజ్‌ చేశారు.

ఏటీఎంలో నగదు నింపే వెహికల్ లో అక్రమంగా తరలిస్తున్న రూ.25.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యూర్‌ కోడ్‌, అనుమతులు లేకుండా నగదు తరలిస్తున్నట్లు పోలీసులు పోలీసులు గుర్తించారు. రైటర్‌ ప్రీవియస్‌ క్యాష్‌ లాజిస్టిక్స్‌ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే       ఈ సంఘటన గురించి పూర్తి సమచారాం తెలియాల్సి ఉంది. మొత్తంగా గతంలోనూ కర్నాటకలోని బళ్లారి జిల్లా కేంద్రంలో ఐదున్నర కోట్ల డబ్బులు, కేజీల కొద్ది బంగారం, వెండి పట్టుబడ్డాయి. బళ్లారి నగరంలోని బ్రూస్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా.. ఓ కారులో భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈ బళ్లారి కార్పెట్ బజార్‌లో ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బు, నగలు తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఇలా భారీగా అక్రమ నగదు బయటపడుతున్నాయి.