బైక్ పై ముద్దులతో న్యూసెన్స్ చేసిన జంట.. తిక్క కుదిర్చిన పోలీసులు

హైదరాబాద్ నగరంలో ఓ జంట బైక్ పై విహరిస్తూ రచ్చ రచ్చ చేసింది. బైక్ పై దూసుకెళ్తూ ముద్దులతో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. ఈ జంటపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో ఓ జంట బైక్ పై విహరిస్తూ రచ్చ రచ్చ చేసింది. బైక్ పై దూసుకెళ్తూ ముద్దులతో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. ఈ జంటపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.

ఇటీవలి కాలంలో యువతలో వెకిలి చేష్టలు ఎక్కువై పోతున్నాయి. పిచ్చి పీక్స్ కు చేరినట్లుగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాము అనే సంగతి మరిచి రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు అసభ్యకరమైన వీడియోలు చేస్తూ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. లైకులు, కామెంట్స్ కోసం విచ్చలవిడిగా వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. బైక్ లపై ప్రమాదరకర రీతిలో స్టంట్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు బైక్ లపై దూసుకెళ్తూ ముద్దులు, హగ్గులతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇదే రీతిలో హైదరాబాద్ నగరంలో ఓ జంట రెచ్చిపోయింది.

నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై బైక్ మీద దూసుకెళ్తూ ముద్దుల్లో మునిగి తేలారు. అందరు చూస్తున్నారన్న సోయి లేకుండా కళ్లు మూసుకుపోయినట్లుగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. దీంతో ఈ వీడియో పోలీసుల వద్దకు చేరింది. ఇంకేముంది బైక్ మీద ముద్దులతో న్యూ సెన్స్ చేసిన ఆ జంట తిక్క కుదిర్చారు. వారిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు యువతీ యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పహాడీ షరీఫ్ లో బైక్ పై వెళ్తూ ఇద్దరు యువతీయువకులు బహిరంగ ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. బైక్ పై రొమాన్స్ చేసిన జంటను కోల్కతాకు చెందిన మహ్మద్ వాసిఫ్ అర్షద్, అన్నపూర్ణ శర్మ గా గుర్తించారు.

అర్షద్ గచ్చిబౌలిలోని ఓ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అన్నపూర్ణ శర్మ.. హైటెక్ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ గచ్చిబౌలిలోని ఓ ఉమెన్స్ పీజీ హాస్టల్ లో ఉంటోంది. సెప్టెంబర్ 22న పహాడిషరీఫ్ రోడ్డుపై అమ్మాయిని బైక్ పై ముందు వైపు రివర్స్ లో కూర్చోబెట్టుకుని ముద్దులతో రెచ్చిపోయారు. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం పిచ్చిరా బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు.

నడిరోడ్డుపై ఇలాంటి పనులేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్ నెంబర్ ను పసిగట్టారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆ బైక్ పైన 8 చలానాలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ప్రమాదకర రీతిలో ప్రయాణించడం, పబ్లిక్ రోడ్లపై వెకిలి చేష్టలు చేస్తూ ఇబ్బందులు కలిగించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments