iDreamPost
android-app
ios-app

వాహనదారులకు అలర్ట్. ఇకపై అలాంటి బైక్స్ అన్నీ పోలీస్ స్టేషన్‌కే..!

Hyderabad Police: ఈ మధ్య కాలంలో కొంతమంది వాహనదారులు నెంబర్ ప్లేట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. అలాంటి వారు బీ అలర్ట్ అంటున్నారు పోలీసులు.

Hyderabad Police: ఈ మధ్య కాలంలో కొంతమంది వాహనదారులు నెంబర్ ప్లేట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. అలాంటి వారు బీ అలర్ట్ అంటున్నారు పోలీసులు.

వాహనదారులకు అలర్ట్. ఇకపై అలాంటి బైక్స్ అన్నీ పోలీస్ స్టేషన్‌కే..!

ఈ మధ్య కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కొంతమంది కేటుగాళ్లు దొంగతనాలకు తెగబడుతున్నారు. రోడ్డు మీద ఒంటరిగా మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పపడిన వారిని పట్టుకోవడానికి పోలీసులకు నెంబర్ ప్లేట్ ముఖ్యమైన ఆధారం. కానీ.. దొంగలు నడిపే బైక్స్, కార్ల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తున్నారు.. అర్థం కాని నెంబర్ల ఉపయోగిస్తున్నారు. దీంతో పోలీసులు కన్ఫ్యూజ్ అవుతూ దొంగల్ని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కొన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నారు. వివరాల్లో వెళితే..

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య చైన్ స్నాచింగ్ కేసులు బాగా పెరిగిపోయాయి. రోడ్డుపై ఒంటరిగా నడిచి వస్తున్న మహిళలను కొంతమంది చైన్ స్నాచర్లు టార్గెట్ చేసుకొని వారి మెడలో వస్తువులు లాక్కెళ్లుతున్నారు. కొన్నిసార్లు మహిళలకు తీవ్ర గాయాలు కావడమే కాదు.. చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటి వారిని పట్టుకోవడంలో పోలీసులకు నెంబర్ ప్లేట్స్ ఎంతో కీలకం. కానీ ఈ మధ్య ఇటువంటి కేసుల్లో సీసీ కెమెరాలు పరిశీలించగా చాలా మంది నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారుతుంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్ చేయాలని ఉన్నతాధికారలు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ లు చేపడుతున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సైఫా బాద్ పోలీసులు నిర్వహించిన డ్రైవ్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మొదటి రోజు 20 కి పైగా బైకులను ఆధీనంలోకి తీసుకున్నారు. కొత్త నెంబర్ ప్లేట్ బిగించుకున్న తర్వాతే తిరిగి వాహనాలు యజమానులకు ఇచ్చారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువగా యూత్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పేరెంట్స్ ఇలాంటి విషయంలో పిల్లలను అలర్ట్ చేయాలని కోరారు. నంబర్ ప్లేట్ పై చివరి అంకెలు కనిపించకుండా నెంబర్ ప్లేట్ ని ట్యాంపరింగ్ చేసినా.. కనిపించకుండా స్టిక్కర్లు అతికించినా బండి సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి