Somesekhar
BRS ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నందిత పీఏ ఆకాశ్ పై పోలీసు కేసు నమోదు అయ్యింది.
BRS ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నందిత పీఏ ఆకాశ్ పై పోలీసు కేసు నమోదు అయ్యింది.
Somesekhar
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాదకర విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటలకు సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించారు. దీంతో కార్యకర్తలు, అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సీటు బెల్డ్ పెట్టుకోకపోవడంతోనే ఆమె మరణించినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లాస్య నందిత పీఏపై కేసు నమోదు అయ్యింది.
BRS ఎమ్మెల్యే లాస్య నందిత మరణం రాష్ట్ర రాజకీయాల్లో విషాదం నింపింది. సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూశారు. ఇక ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతలతో పాటుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు ఆమె పాడెను మోశారు. ఇక ఈ ప్రమాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్ చెరువు పోలీసులు నందిత పీఏ ఆకాశ్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు అయ్యింది. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆకాశేనని, అతడు నిర్లక్ష్యంగా కారు నడపడం కారణంగానే తన సోదరి లాస్య మరణించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడ్డ ఆకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదికూడా చదవండి: లాస్య నందిత అంత్యక్రియల్లో పాడె మోసిన హరీష్ రావు