iDreamPost

ఐస్ క్రీంలో వీర్యం కలిపి అమ్మిన వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు!

వరంగల్ జిల్లా నెక్కొండలో ఓ ఐస్ క్రీం బండి వ్యాపారి దారుణానికి తెగబడ్డాడు. ఐస్ క్రీంలో వీర్యం, మూత్రం కలిపి అమ్మాడు. దీనిపై విచారణ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

వరంగల్ జిల్లా నెక్కొండలో ఓ ఐస్ క్రీం బండి వ్యాపారి దారుణానికి తెగబడ్డాడు. ఐస్ క్రీంలో వీర్యం, మూత్రం కలిపి అమ్మాడు. దీనిపై విచారణ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఐస్ క్రీంలో వీర్యం కలిపి అమ్మిన వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు!

ఐస్ క్రీం.. చిన్న పిల్లల దగ్గర్నుంచి.. పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. మరీ ముఖ్యంగా మండు వేసవిలో ఐస్ క్రీం వినియోగం ఎక్కువగా ఉంటుంది. రకరకాల ఐస్ క్రీంలు కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఎక్కడ చూసినా ఐస్ క్రీం తోపుడు బండ్లు కనిపిస్తుంటాయి. అయితే వరంగల్ జిల్లాలో తాజాగా జరిగిన ఘటన ఐస్ క్రీం తినాలంటేనే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. ఐస్ క్రీం అమ్మే ఓ వ్యక్తి హస్తప్రయోగం చేసుకుంటూ ఐస్ క్రీంలో వీర్యం కలిపాడు. దీంతో పాటు మూత్రం కూడా కలిపాడు.

ఈ దారుణ ఘటన నెక్కొండలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది కాస్త పోలీసుల వద్దకు చేరడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నెక్కొండ మండలంలో రాజస్థాన్ కు చెందినటువంటి కాలురం కుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఐస్ క్రీంలో వీర్యం కలిపాడు. దీనిపై విచారణ చేపట్టారు పోలీసులు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి వచ్చి అక్కడ ఐస్ క్రీం శాంపిల్ సేకరించారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపైన చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.

ఐస్ క్రీంలు, ఫ్రూట్ జ్యూస్ లు, సాస్, ఇంకా ఇతర పదార్థాలను కల్తీ చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వ్యర్థపు నీళ్లు, కెమికల్స్ కలుపుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇదిలా ఉంటే నెక్కొండలో ఐస్ క్రీం అమ్మే వ్యక్తి పట్టపగలు హస్తప్రయోగం చేసుకుంటూ ఐస్ క్రీంలో వీర్యం కలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారడంతో వీడు అసలు మనిషేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెక్కొండ మండల చుట్టుపక్కలా బాలాజీ కంపెనీ పేరుతో కొంతకాలంగా ఫలుదా ఐస్ క్రీమ్ బిజినెస్ నడుస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఐస్ క్రీం అమ్మె వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం కలిపి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత శీతలపానియాలు, ఐస్ క్రీంలు తినాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి