iDreamPost
android-app
ios-app

పండక్కి ఊరెళ్తున్నారా?.. ఇళ్లు జాగ్రత్త.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండగను మరింత ఆనందంగా జరుపుకునుందుకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు సూచించారు.

మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండగను మరింత ఆనందంగా జరుపుకునుందుకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు సూచించారు.

పండక్కి ఊరెళ్తున్నారా?.. ఇళ్లు జాగ్రత్త.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రానుండగా ఇప్పటికే సందడి షురువైంది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా పండగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను మరింత ఆనందంగా జరుపుకునుందుకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారు ఊర్లల్లో ఉండే కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకునేందుకు భారీ సంఖ్యలో ఊళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరం సగం ఖాళీ అవుతుంది. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా పండక్కి ఊర్లకు వెళ్లే వారికి బిగ్ సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. అవేంటంటే?

పండగ వేళ ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్తుంటారు. ఇదే సమయంలో దొంగలు వారి బుద్దికి పనిచెప్తుంటారు. అందిన కాడికి దోచుకోవడానికి సిద్ధమైపోతుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంటి యజమానులకు, పండక్కి ఊరెళ్లే వారిని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఊరెళ్లే వారు అజాగ్రత్తగా ఉండకూడదని, విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే తమతో పాటు తీసుకెళ్లడం గానీ, నగదు, బంగారం వంటి వాటిని బ్యాంకుల్లో భద్రపర్చుకోవాలని సూచిస్తున్నారు. ఊరెళ్తున్న విషయం పక్కింటి వారికి చెప్పాలని, లేదా పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

పోలీసుల సూచనలు ఇవే:

  • ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనిపించకుండా కర్టెన్‌తో కప్పేయాలి.
  • సొంతూళ్లకు వెళ్లేవారు ఇంటి ఆవరణలో, లేదా ఇంటి లోపల ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచడం మంచిది.
  • పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.
  • విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.
  • విలువైన వస్తువులను కారు డిక్కీల్లో పెట్టి మర్చిపోకండి.
  • నమ్మకమైన వ్యక్తులను వాచ్‌మెన్‌గా నియమించుకోవడం ఉత్తమం.
  • బీరువా తాళాలను ఇంట్లో కప్ బోర్డులలో, ఇతర ప్రాంతాల్లో విడిచి వెళ్లరాదు.
  • ఆరుబయట ఉంచిన వాహనాలకు హ్యాండిల్‌ లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ కూడా వేయడం ఉత్తమం.
  • సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, వాటిని మీ మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకుంటే, మీరు ఎక్కడ ఉన్నా.. మీ ఇంటి పరిసరాలు, వ్యక్తుల కదలికలపై కన్నేసి ఉంచవచ్చు.
  • ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
  • స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్‌ దగ్గరుంచుకోవడం ఎల్లవేళలా సురక్షితం.
  • కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. కాలనీల్లో అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.