తల్లిదండ్రులు జాగ్రత్త.. మీ పిల్లల విషయంలో పోలీసుల డీపీతో ట్రాప్!

తల్లిదండ్రులు జాగ్రత్త.. మీ పిల్లల విషయంలో పోలీసుల డీపీతో ట్రాప్!

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ ముఠా వివిధ మార్గాల్లో సామాన్యులను నిండ ముంచేస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి వారి మాటలను నమ్మితే..నిండా ముంచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ ముఠా వివిధ మార్గాల్లో సామాన్యులను నిండ ముంచేస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి వారి మాటలను నమ్మితే..నిండా ముంచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

నేటికాలంలో దొంగతనాలు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. అంతేకాక వారు ఎంచుకునే మార్గాలు కూడా కొత్తగా ఉంటున్నాయి. ముఖ్యంగా గతంలో చోరీలు ఇళ్లలోకి వెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు దొంగాలు రూపం మార్చుకుని సైబర్ కేటుగాళ్ల అవతారం ఎత్తారు. వివిధ రకాలుగా సామాన్యులను మభ్య పెడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా పోలీసుల పేరుతో ఈ సైబర్ దొంగళ్లు రెచ్చిపోయారు. మీ పిల్లలు డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారంటూ..పిల్లల తల్లిదండ్రులను పోలీసుల డీపీతో ట్రాప్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మాటలు నమ్మి చాలా మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పేరుతో సైబర్ దొంగలు రెచ్చిపోయారు. పోలీసులు డీపీ వాడుకుని ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఉపాధి కోసం, కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లిన కుటుంబాలు, ఇలానే ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలే లక్ష్యంగా  చేసుకుని కేటుగాళ్లు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో మీ పిల్లలు పట్టుబడ్డారని తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసి..ట్రాప్ చేస్తున్నారు. మీ పిల్లలను విడిచి పెట్టాలంటే తాము చెప్పినంత డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. ఇలా చాలా మంది సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి దాదాపు 10 మంది లక్షల్లో మోసపోయారు. ఆ తరువాత పిల్లల నుంచి కాల్స్ రావడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు. దీంతో వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మోసాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ తరహా మోసాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించారు. పోలీసుల పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దని సూచించారు. ఐదు రోజులుగా పోలీసుల పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తే.. భయపడవద్దని, అలానే వారికి స్పందించవద్దని తెలిపారు. వెంటనే స్థానిక  పోలీసులకు తెలియజేయాలన్నారు అవసరం లేని చోట్ల మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని అధికారులు బాధితులకు సూచించారు. సైబర్ కేటుగాళ్లకు మన ద్వారానే మన సమాచారం వెళ్తుందని, అప్రమత్తంగా ఉండాలన పోలీసులు తెలిపారు. ఇలానే  అనేక మార్గాల్లో చదువుకున్న వారిని సైతం సైబర్ కేటుగాళ్లు  మోసం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న.. మన అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు.  ఇటీవల బ్యాంకుల నుంచి కాల్స్ అంటూ కూడా  కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

Show comments