P Venkatesh
బోరు బావి నుంచి మంచి నీరుకు బదులుగా పింకు కలర్ వాటర్ దర్శనమిస్తుంది. గులాబీ రంగు నీళ్లు ఏకదాటిగా వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు మీకోసం..
బోరు బావి నుంచి మంచి నీరుకు బదులుగా పింకు కలర్ వాటర్ దర్శనమిస్తుంది. గులాబీ రంగు నీళ్లు ఏకదాటిగా వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు మీకోసం..
P Venkatesh
వ్యవసాయ అవసరాలకు బోరు బావులను డ్రిల్ చేస్తుంటారు. అంతేగాక గృహావసరాలకు కూడా ఇళ్లల్లో బోరు సదుపాయం ఏర్పాటు చేసుకుంటున్నారు. బోరు బావుల నుంచి వచ్చే నీరు స్వచ్ఛంగానే ఉంటుంది. నీరు సార్వత్రిక ద్రావణి. నీటికి రంగు లేనప్పటికీ అది ఉండే పరిస్థితులను బట్టీ మారుతూ ఉంటుంది. అయితే కొంత వరకు స్వచ్ఛమైన నీరు నీలం రంగును కలిగి ఉంటుంది. కాగా ఓ బోరు బావి నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా గులాబీ రంగులో నీళ్లు బయటికి వస్తున్నాయి. అప్పటి వరకు మంచినీళ్లను అందించిన బోరు బావి నుంచి ఆకస్మాత్తుగా గులాబీ రంగు నీళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇది దేవుడి మాయనా.. లేదా కెమికల్స్ కారణంగా విషపూరితంగా మారాయా అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నురులో గులాబీ రంగు నీళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. చెన్నూరు పట్టణంలో నివాసముండే కట్ట శ్రీనివాస చారి అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి అవసరాల కోసం శ్రీనివాస చారి బోరు బావిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు మంచి నీరును అందించింది ఆ బోరు బావి. ఇక ఈ రోజు ఉదయం శ్రీనివాస చారి మోటార్ ను ఆన్ చేయగా గులాబీ రంగు నీళ్లు దర్శనమిచ్చాయి. బోరు బావి నుంచి ఏకదాటిగా గులాబీ రంగు నీళ్లు వస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు చారి కుటుంబసభ్యులు. ఎప్పుడు లేనిది ఈ రోజు గులాబీ రంగు రావడం ఏంటనీ కాసింత భయందోళనకు గురైన చారి ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు.
దీంతో గులాబీ రంగు నీళ్ల వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు భారీ సంఖ్యలో శ్రీనివాస చారి ఇంటికి చేరుకున్నారు. వింతగా బోరు బావి నుంచి వస్తున్న గులాబీ రంగు నీళ్లను చూసి ఆందోళన చెందారు. అయితే ఆ చుట్టు పక్కన ఉన్న బోరు బావుల్లో స్వఛ్ఛమైన నీరు వస్తుండగా.. ఒక్క శ్రీనివాస చారి ఇంట్లోని బోరుబావిలో గులాబీ రంగు నీళ్లు రావడం చర్చనీయాంశంగా మారింది. గులాబీ రంగు నీళ్లు రావడానికి గల కారణాలేమై ఉంటాయని, గ్రౌండ్ వాటర్ విషంగా మారండం వల్లనే ఇలా జరిగిందా అని తమలో తాము చర్చించుకుంటున్నారు. ఏదేమైనా బోరు బావి నుంచి గులాబీ రంగు నీళ్లు రావడానికి గల కారణాలను సంబంధిత అధికారులు విశ్లేషించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి బోరు బావి నుంచి గులాబీ రంగు నీళ్లు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.