PET దారుణం.. స్నానం చేస్తుంటే వీడియోలు తీస్తూ..

Sirisilla Social Welfare Hostel Students Issue: విద్యార్థులకు విద్యాబుద్దులు, క్రమ శిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తప్పుదోవ పడుతున్నారు. వారి అరాచకాలకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన సిరిసిల్లలో వెలుగు చూసింది.

Sirisilla Social Welfare Hostel Students Issue: విద్యార్థులకు విద్యాబుద్దులు, క్రమ శిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తప్పుదోవ పడుతున్నారు. వారి అరాచకాలకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన సిరిసిల్లలో వెలుగు చూసింది.

ఇటీవల ఆడవాళ్లపై జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. మహిళలపై జరుగుతున్న మగవాళ్ల వేధింపులకు సంబంధించి నిత్యం పదుల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.ఆడవాళ్లపై మగవాళ్లే కాదు.. ఆడవాళ్ల వేధింపులు కూడా జరుగుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఎంతో గొప్ప స్థానం ఇస్తారు. గురువులను త్రిమూర్తులతో పోల్చుతారు. కానీ.. ఇటీవల కొంతమంది గురువులు మద్యం సేవించి విద్యాసంస్థలకు రావడం, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోటి ఉపాధ్యాయులతో గొడవ పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఓ మహిళా పీఈటీ దారుణాలు చూడలేక విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన తీవ్ర సంచలనం రేపుతుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతీ గృహంలో ఓ మహిళా పీఈటీ చేస్తున్న దారుణాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా పీఈటీ జ్యోత్స్న తమను దారుణంగా వేధిస్తుందని విద్యార్థులు రోడ్డెక్కారు. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సిరిసిల్ల -సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు 500 మంది విద్యార్థినులు నిరసనకు దిగడంతో వారి కష్టాలు వెలుగులోకి వచ్చాయి. నెలవారి పీరియడ్ టైమ్ లో కూడా కొడుతుందని.. బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో పీఈటీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ డోర్ పగులగొట్టి లోనికి వచ్చి తన సెల్ ఫోన్ తో వీడియో రికార్డు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె వచ్చినప్పటి నుంచి తమకు నరకం చూపిస్తుందని విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రతి విషయానికి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం, కర్రతో కొట్టడం లాంటివి చేస్తుందని.. కొన్నిసార్లు ఆమె సైకోగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జ్యోత్స్య అవుట్ సోర్సింగ్ పద్దతిలతో జాబ్ చేస్తుంది. ఆమెపై ప్రిన్సిపల్ తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు నిరసన చేస్తున్న విషయం తెలుసుకొని ఎంఈవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆ పీఈటీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు. దీంతో ఎంఈవో రఘుపతి విద్యార్థుల డిమాండ్ మేరకు పీఈటీ జ్యోత్స్య ను విధుల నుంచి తొలగించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని విద్యార్థినులకు భరోసా ఇచ్చారు ఎంఈవో.

Show comments