Keerthi
టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న కాలంలో దేశంలోని క్కడలేని వింతలు వైడుర్యాలు అనేవి వైరల్ అవుతుంటాయి. రాను రాను ప్రజల్లో వింత ఆచారాలు, మూఢ విశ్వసాలనేవి బలంగా పాతుకుపోతున్నాయి . తాజాగా ఓ గ్రామంలో జరిగిన సంఘటనకు అయోధ్య రాముడే కారణమని ప్రజలు నమ్ముతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..
టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న కాలంలో దేశంలోని క్కడలేని వింతలు వైడుర్యాలు అనేవి వైరల్ అవుతుంటాయి. రాను రాను ప్రజల్లో వింత ఆచారాలు, మూఢ విశ్వసాలనేవి బలంగా పాతుకుపోతున్నాయి . తాజాగా ఓ గ్రామంలో జరిగిన సంఘటనకు అయోధ్య రాముడే కారణమని ప్రజలు నమ్ముతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..
Keerthi
ప్రస్తుత సమాజంలో ఎక్కడలేని వింతలు వైడుర్యాలు అనేవి తరుచుగా వైరల్ అవుతుంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా ప్రజల్లోని వింత ఆచారాలు, మూఢ నమ్మకాలనేవి బలంగా పాతుకుపోయాయి. చదువుకున్న వాళ్లు సైతం ఇలాంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. కాలం మారిన, తరాలు మారిన ఈ మూఢ విశ్వసాలకు క్రమంగా నంది పలుకుతునే ఉంది. కొన్ని సందర్భల్లో అది కాస్తా ఇదిగో పులి అంటే అదిగో మేక అనే సామెత రీతిలో పాకుకు పోతుంది. ఇలాంటి వింత పుకారులను కొంతమంది నమ్మడమే కాకాండా ప్రచారం కూడా చేస్తారు. దీంతో ఎక్కడలేని పరిసరా ప్రాంతాల్లో ప్రజల కూడా ఆ పుకారాలను నిజం అని భావిస్తారు. ఇదిలా ఉంటే.. గతంలో చాలా ప్రాంతాల్లో వేప చేట్టు నుంచి పాలు కారడం వంటి వార్తలు వినే ఉంటారు. ఇది ఏదో దేవుడి మహిమని ప్రజలు తండోపతండాలుగా వెళ్లి పూజలు చేయడం చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. కానీ అక్కడ కారేది పాలు కాదు. ఇంతకి అది ఏమిటంటే..
సాధారణంగా ప్రజల మూఢ నమ్మకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఏదైనా ప్రకృతిలో వింత సంఘటనలు జరిగితే చాలు దాన్ని దైవంతో ముడి పెడతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. విచిత్రంమేటంటే.. ఇక్కడ ఓ రావి చెట్టు నుంచి నీళ్లు దారాల వస్తున్నాయి. ఈ సంఘటన నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామం వద్ద జరిగింది. అక్కడ స్థానికంగా ఉండే ఆంజనేయ ఆలయం ఆవరణలో రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మానులోంచి అకస్మాత్తుగా నీళ్లు చుక్కలు చుక్కలుగా వస్తుండడం భక్తులు గుర్తించారు. దీంతో ఆ ఆలయానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ఆ జలాన్ని మహ తీర్థంలా భావిస్తున్నారు. అలాగే ఆ జలాన్ని సేవిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న ప్రచారం జరగడటంతో.. ఆ జలాన్ని సేవించేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. ఇది అంత ఆ భగవంతుని లీల అంటూ భక్తులంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
క్రమంగా ఈ వార్త ఈ నోట ఆ నోట ఊరంతా పాకడంతో పెద్ద ఎత్తున మహిళలు రావి చెట్టు వద్దకు పరుగులు తీశారు. అలాగే పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఈ తీర్థన్ని ఒడిసి పట్టుకుని సేవించారు. దీంతో పాటు కొబ్బరికాయలు కొట్టి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. కాగా, ఈ విషయం పక్క గ్రామాలకు సైతం పాకడంతో భారీ సంఖ్యలో ప్రజలు ఆ ఆలయం వద్దకు పరుగులు తీశారు.
అయితే ఇన్నేళ్లుగా రావి చెట్టు నుంచి రాని దార ఇప్పుడు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యనికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇదంతా ఆ రామయ్య లీలే అంటున్నారు. ఎందుకంటే.. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచే ఈ నీటి దార కనిపించడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పూసినట్టుగా అయ్యింది. కానీ, కొందరు మాత్రం అది ప్రకృతి సిద్దంగా జరిగిన మార్పు మాత్రమేనని, ఎలాంటి మహిమలు లేదని కొట్టి పారేస్తున్నారు. మరి, రావి చెట్టు నుంచి నీరు దార రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.