iDreamPost
android-app
ios-app

ఈ రూల్ తెలిస్తే మీ పిల్లల్ని స్కూల్ బస్సు ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు!

  • Published Aug 09, 2024 | 4:00 AM Updated Updated Aug 09, 2024 | 4:00 AM

Parents Must Be Aware Of This School Bus Rule: ఈ మధ్య కాలంలో స్కూల్ బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బస్ ఫిట్నెస్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ రూల్ గురించి తెలుసుకుంటే ప్రమాదాలు జరక్కుండా ఆపవచ్చు.

Parents Must Be Aware Of This School Bus Rule: ఈ మధ్య కాలంలో స్కూల్ బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బస్ ఫిట్నెస్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ రూల్ గురించి తెలుసుకుంటే ప్రమాదాలు జరక్కుండా ఆపవచ్చు.

ఈ రూల్ తెలిస్తే మీ పిల్లల్ని స్కూల్ బస్సు ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు!

హైదరాబాద్ లోని కాటేదాన్ ఎన్జీవోస్ కాలనీలో ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేసి బస్సుని నిలిపి ఉంచాడు. అయితే బస్సులో ఉన్న స్టూడెంట్ ఒకరు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడంతో ఆగి ఉన్న బస్సు వెనక్కి కదిలి బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. కానీ ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే ఇది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి. ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో అనేది అంచనా వేయలేము. కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లక్షలు ఫీజు కడుతున్నాం కదా.. స్కూల్ మేనేజ్మెంట్ చూసుకుంటుందిలే అని నిర్లక్ష్యం చేయకండి.

బస్సు ఫిట్నెస్, కండిషన్ వంటి అంశాలు ఆర్టీవో అధికారులు, మేనేజ్మెంట్ చూసుకుంటుంది కదా.. మనకేం అవసరం అని అనుకోకండి. ఎవరి పిల్లల గురించి వాళ్ళే జాగ్రత్తలు పాటించాలి. బస్సు ఫిట్నెస్ బాగుందా లేదా? కండిషన్ లో ఉందా? అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతున్నాడేమో అనేది చెక్ చేయాలి. మద్యం తాగి నడుపుతున్నాడేమో అనేది తెలుసుకోవాలి. అందుకోసం తల్లిదండ్రులకు స్కూల్ బస్సుల్లో ప్రయాణించే హక్కు ఉంది. బస్సుకి సంబంధించిన ఫిట్నెస్ రిపోర్టులను స్కూల్ మేనేజ్మెంట్ ని అడిగి తీసుకోవచ్చు. అంతేకాదు డ్రైవర్ మరియు హెల్పర్ ప్రవర్తనను స్వయంగా గమనించవచ్చు. ఈ విషయంలో సమస్యలు ఉంటే మీరు మేనేజ్మెంట్ ని నిలదీయవచ్చు. మేనేజ్మెంట్ స్పందించకపోతే ఆర్టీవో అధికారుల దృష్టికి తీసుకెళ్ళచ్చు.

ఈ రూల్ గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. ఈ రూల్ ప్రకారం తల్లిదండ్రులు కనీసం ఒక్కసారైనా స్కూల్ బస్సుల్లో ప్రయాణించి లోటుపాట్లు గమనించాలి. పేరెంట్స్, టీచర్ మీటింగ్ జరిగినప్పుడు స్కూల్ బస్సు లోపాల గురించి కూడా మాట్లాడండి. ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది? హెల్పర్ ప్రవర్తన ఎలా ఉంది? వంటి వాటిపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. అంతేకాదు బస్సులో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందో లేదో తనిఖీ చేయాలి. బస్సు కిటికీలకు అడ్డు గ్రిల్స్ ఉండాలి. బస్సులో అగ్నిమాపక పరికరం ఉండాలి. బస్సు మీద స్కూల్ పేరు, ఫోన్ నంబర్ రాసి ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది సరిగా పని చేస్తుందో లేదో చూడాలి. తల్లిదండ్రులు డ్రైవర్ తో ఎప్పుడూ కాంటాక్ట్ లో ఉండాలి. బస్సుని నిదానంగా నడపమని చెబుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తే ప్రమాదాలు జరక్కుండా ఆపవచ్చు. వేరే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే చెప్పలేం గానీ బస్సు డ్రైవర్ వల్ల గానీ, బస్సులో లోపాల వల్ల గానీ జరక్కుండా ఆపడం అనేది తల్లిదండ్రుల మీదే ఉంది.