iDreamPost

విషాదం.. వైద్య విద్యార్థిని కన్నుమూత

హుజురాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని కన్నుమూసింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

హుజురాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని కన్నుమూసింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

విషాదం.. వైద్య విద్యార్థిని కన్నుమూత

మరణం ఎప్పుడు ఎలా సంబవిస్తుందో ఊహించలేము. మనిషి జీవితం నీటి మీది బుడగలాంటిది. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పుల కారణంగా ఆయు ప్రామాణాలు తగ్గిపోతున్నాయి. ఇదే విధంగా ఓ వైద్య విద్యార్థిని జార్జియా దేశంలో ప్రాణాలు కోల్పోయింది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిల్చింది. కూతురు మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలని హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన పంజాల రిచితగా గుర్తించారు.

పంజాల రిచిత (20) శుక్రవారం ఊపిరితిత్తుల వ్యాధి తో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఈమె జార్జియా దేశంలో వైద్య విద్యలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. వెంటనే అక్కడి తోటి విద్యార్థులు చికిత్స కోసం ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తండ్రి పంజాల రాజు జగిత్యాల జిల్లాలో విద్యుత్ శాఖలో ఈఆర్ఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. రిచిత మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి