P Krishna
Organs Donated:ఈ మద్య కాలంలో చాలా మంది తాము చనిపోతూ మరికొంతమందికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు..మనిషి ప్రాణం విలువ తెలిసిన కుటుంబ సభ్యులు చనిపోయిన వారి అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
Organs Donated:ఈ మద్య కాలంలో చాలా మంది తాము చనిపోతూ మరికొంతమందికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు..మనిషి ప్రాణం విలువ తెలిసిన కుటుంబ సభ్యులు చనిపోయిన వారి అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
P Krishna
ఈ జీవకోటిలో మనిషి జన్మ చాలా అద్బుతం అంటారు. అన్ని జీవుల్లో కెల్ల మనిషి అత్యంత తెలివైనవాడు. ఈ జీవితంలో ఏదైనా గొప్ప పని చేసి పది మందికి గుర్తుండిపోయేలా చేయాలని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు. సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుంచి 200 అవయవాలు దానం చేసి పదిమంది ప్రాణాలు కాపాడవొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల ఎంతోమందికి అవయవదానంపై అవగాహన పెరిగి స్వచ్ఛందంగా వారి ఆర్గాన్స్ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి ఆర్గాన్స్ దానం చేస్తున్నారు. బంగారు భవిష్యత్ ఉన్న తమ కూతురు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడంతో ఆమె అవయవదానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ కి మేడ్చల్ కి చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు దీపిక(16) ఈ నెల 22 న హఠాత్తుగా ఫిట్స్ రావడంతో ఇంట్లో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీపికను వెంటనే యశోద హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు వైద్య పరీక్ష చేసిన తర్వాత దీపిక బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం దీపిక తల్లిదండ్రులు శ్రీనివాస్, సరితకు తెలిపారు. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న తమ కూతురు జీవితంలో ఇలాంటి విషాద సంఘటన జరగడంతో తల్లిదండ్రులకు కుమిలిపోయారు. ఈ క్రమంలోనే వైద్యులు దీపిక తల్లిదండ్రులకు అవయవదానం చేయడం వల్ల మరో నలుగురు జివితాల్లో వెలుగు నింపవొచ్చని కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే దీపిక తల్లిదండ్రులు తమ కూతురు చనిపోయినా.. పదిమంది జీవితాల్లో వెలుగు నింపుతుందనే ఉద్దేశంతో అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. 25న దీపిక కన్నుమూయడంతో పది మందికి అవయవ దానం చేసి ప్రాణదానం చేశారు. ఈ విషయం గురించి దీపిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ పాప చదువుల్లో ఎంతోబాగా రాణిస్తుందని.. గొప్ప చదువులు చదివి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని భావించేదని.. కానీ ఆమె చనిపోయి ఇలా పదిమందికి ఉపయోగపడుతుందని ఊహించలేదని అన్నారు. తమ కూతురు ఎప్పటికీ సజీవంగా ఉంటుందని అన్నారు.