Arjun Suravaram
TIMS Hospital: భూమి మీద చరిత్రలో నిలిచిపోయిన ప్రదేశాలు, మనషులు, ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. అలానే ఓ ఆస్పత్రి గురించి తాాజాగా అందరిలో చర్చ నడుస్తోంది. కరోనా సమయంలో వందల మందిని కాపాడిని ఓ ఆస్పత్రి నేడు కేవలం ఓపీలకు మాత్రమే పరిమితమైంది.
TIMS Hospital: భూమి మీద చరిత్రలో నిలిచిపోయిన ప్రదేశాలు, మనషులు, ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. అలానే ఓ ఆస్పత్రి గురించి తాాజాగా అందరిలో చర్చ నడుస్తోంది. కరోనా సమయంలో వందల మందిని కాపాడిని ఓ ఆస్పత్రి నేడు కేవలం ఓపీలకు మాత్రమే పరిమితమైంది.
Arjun Suravaram
ప్రపంచంలో ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. మనిషికి, భవనాలకు, చెట్లకు, ప్రాంతాలకు.. ఇలా ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. అలానే ఓ ఆస్పత్రికి కూడా ఎంతో చరిత్ర ఉంది. గతంలో వందల మంది ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి.. నేడు ఓపీ సేవలకు పరిమితం అయ్యింది. అదే గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఆస్పత్రి. ఇది కరోనా మహ్మమ్మారి సమయంలో రోగులతో కిటకిటలాడింది. దాదాపు రూ.15 కోట్లు వెచ్చించి కేవలం నెల రోజుల వ్యవధిలోనే సిద్ధం చేశారు. ఈ ఆస్పత్రిని 2020 ఏప్రిల్ 20న ఆరంభించారు. కరోనా సమయంలో పేషెంట్లకు చికిత్సను అందించారు. కానీ నేడు ఓపీ సేవలకు మాత్రమే పరిమితం అయింది.
కోవిడ్ సమయంలో గచ్చిబౌలి స్టేడియంలోని 13 అంతస్తులతో టిమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. స్పోర్ట్స్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో 15 వందల పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ ఆస్పత్రిలో వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ150 మంది వైద్యులు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర సిబ్బందిని పని చేశారు. కరోనా సమయంలో వీరందరు రోగులకు సేవలు అందించారు. కరోనా బాగా విజృంభిస్తున్న సమయంలో ఈ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది మెరుగైన సేవలందించి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు.
కరోనా ప్రభావం తగ్గిన తరువా.. దీనిని మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా, పీజీ వైద్య విద్యాకేంద్రంగా మారుస్తామని అప్పటి పాలకులు హామి ఇచ్చారు. తరువాతి కాలంలో టిమ్స్‌ను మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దే అంశాన్ని పక్కన పెట్టేశారు. ఫలితంగా టిమ్స్ ఇప్పుడు ప్రాథమిక ఆర్యోగ కేంద్రంగా తయారైంది. కోవిడ్ పూర్తిగా తగ్గిన తరువాత నుంచి ఆసుపత్రి సేవలను క్రమంగా నిలిపివేస్తూ వచ్చారని స్థానికులు తెలిపారు. ఇక్కడ పని చేసిన వైద్యులను, సిబ్బందిని వేరే ఆసుపత్రులకు బదిలీ చేశారు. అలానే కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకున్న సిబ్బందిని విధుల నుంచి తొలగించారంట.
ఈ ఆస్పత్రిలో ఉన్న ఖరీదైన వైద్య పరికరాలను కొన్నింటిని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రసుత్తం టిమ్స్ లో ఒకరిద్దరు వైద్యులు, కొందరు నర్సులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నాడు వందల మందికి ప్రాణాలు పోసిన ఈ కేంద్రం, నేడు ఓపీ సేవలు మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఓపీ సేవలందిస్తూ ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేస్తున్నామని టిమ్స్ సూపరింటెండెంట్ ఇషాన్ అహ్మద్ వెల్లడించారు. టిమ్స్‌ను మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దే అంశం ప్రభుత్వ పరిశీలన ఉందన్నారు.
ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే.. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై భారం తగ్గుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలా వందల మంది ప్రాణాలు కాపాడిన టిమ్స్ ఆసుపత్రి.. ఏడాదిగా కేవలం ఔట్ పేషెంట్ సేవలకే పరిమితమైంది. మరి.. ఈ ఆస్పత్రి స్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.