Krishna Kowshik
పిల్లల గురించి తల్లిదండ్రులు ఎన్నోె కలలు కంటుంటారు. కానీ నేటి యువతరం సగం సెల్ ఫోన్ లోనే మునిగి తేలిపోతుంది. ఆ దునియాలో తలలు పెట్టేస్తూ, పక్క మనిషి ఎలా ఉంటాడో కూడా మర్చిపోతున్నారు. కొన్ని సార్లు దుర అలవాట్లకు లోనవుతన్నారు.
పిల్లల గురించి తల్లిదండ్రులు ఎన్నోె కలలు కంటుంటారు. కానీ నేటి యువతరం సగం సెల్ ఫోన్ లోనే మునిగి తేలిపోతుంది. ఆ దునియాలో తలలు పెట్టేస్తూ, పక్క మనిషి ఎలా ఉంటాడో కూడా మర్చిపోతున్నారు. కొన్ని సార్లు దుర అలవాట్లకు లోనవుతన్నారు.
Krishna Kowshik
సరదాగా పందెం కాయడం వల్ల సమస్య రాదు కానీ..డబ్బు సంపాదించాలన్న యావతో బెట్టింగ్ కట్టడం ఎంతటి దారుణానికైనా దారి తీస్తుంది. సెల్ ఫోన్లు వచ్చాక ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పొగొట్టుకుని అప్పుల పాలు అయిపోయినవారున్నారు. సరదా కోసం మొదలైన ఆట.. ఆ తర్వాత వ్యసనంలా మారిపోతుంది. అందులో డబ్బు పెడుతూ.. గేమ్ ఆడటం మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మనిషిలా మారిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్ కడుతూ.. అందులోనే గడిపేస్తూ కాలాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకుని, బయట పడదామన్నా పడలేక.. అటు పేరెంట్స్ కు తెలిస్తే ఏమంటారోనన్న భయంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
వరంగల్ జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ స్టూడెంట్.. ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడి.. అర్థాంతరంగా తనువు చాలించాడు. తండ్రికి కడుపు తీపి మిగిల్చాడు. వివరాల్లోకి వెలితే.. నర్సంపేటలోని మాదన్న పేట రోడ్డుకు చెందిన ఓ బాలుడు స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. అతడి తల్లి అనారోగ్యంతో నాలుగు సంవత్సరాల క్రితం మరణించింది. తండ్రి తన రెక్కల కష్టం మీద అతడిని చదివిస్తున్నాడు. తండ్రి టైలర్‌గా పని చేస్తూ ఆ పిల్లవాడికి తల్లి, తండ్రి అన్నీ తానే అయ్యాడు. ఈ క్రమంలో కుమారుడు గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడేందుకు తండ్రికి తెలియకుండా అతడి క్రెడిట్ కార్డును వినియోగించాడు.
ఆ డబ్బులు కూడా చాలక.. బయట కూడా తెలిసిన వారి దగ్గర నుండి అప్పులు చేసి ఆటల్లో పెట్టేవాడు. ఇలా సుమారు రూ. 2 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే ఈ విషయం తండ్రికి తెలిస్తే ఏమౌతుందన్న భయం అతడిలో నెలకొంది. ఈ భయంతోనే ఇంట్లో బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు. చెట్టంత కొడుకు విగత జీవిగా కనిపించే సరికి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా చేస్తాడనుకోలేదని, సమస్య ఉంటే చెప్పాలని భోరున విలపిస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు పని చేస్తుంటే.. వారి కష్టాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పిల్లలు ఆన్ లైన్ గేమ్స్, ఇతర వ్యాపకాలతో పక్కదోవ పడుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ కారణంగా పిల్లలు బలౌకుండా ఉండాలంటే పరిష్కార మార్గంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.