Keerthi
సహజంగా ప్రతి ఇళ్లలో దోమల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి ప్రజలు ఎక్కువగా మస్కిటో కాయిల్ ని ఉపాయోగించారు. అలా మస్కిటో కాయిల్ ని వాడటమే ఓ కుటుంబంలోని తీవ్ర ప్రమాదానికి చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే..
సహజంగా ప్రతి ఇళ్లలో దోమల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి ప్రజలు ఎక్కువగా మస్కిటో కాయిల్ ని ఉపాయోగించారు. అలా మస్కిటో కాయిల్ ని వాడటమే ఓ కుటుంబంలోని తీవ్ర ప్రమాదానికి చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే..
Keerthi
సాధారణంగా ప్రతి ఇళ్లలో దోమల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ దోమ కాటు నుంచి తప్పించుకొని, వాటిని నివారించేందుకు రకరకాల ప్రయత్నలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే దోమల బ్యాట్, మస్కిటో క్రీమ్స్, మస్కిటో స్ప్రే, మస్కిటో కాయిల్స్ వంటివి ఎక్కువగా ఉపాయోగిస్తారు. అయితే చాలామంది ఇళ్లలో ఎక్కువగా ఉపాయోగించే అస్త్రం దోమల బత్తి. ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనలతో తయారవుతాయి. వీటి వలన వెలువడే పొగ ఆరోగ్యనికి హానికరం. అంతేకాకుండా వీటి వలన ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. దోమల బెడద లేకుండా ఎంతో ప్రశాంతంగా నిద్రపోవాలని ఈ దోమల బత్తిని వాడుతుంటారు. కానీ, వీటి వలన ఇటీవల కాలంలో చాలా కుటుంబలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దోమల చక్రం వలన ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని మస్కిటో కాయిల్ పెట్టుకున్న ఓ కుటుంబంలో వ్యక్తి ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చింది. చిన్న నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఆ వ్యక్తి మృత్యువుతో పోరాతడుతున్నాడు. ఈ ప్రమాదకరమైన సంఘటన హైదరాబాద్ పాత బస్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ నగర్‌లో మహ్మద్ అద్దిక్ అనే వ్యక్తికి రాత్రి నిద్రపోయే ముందు దోమల బత్తిని వెలిగించాడు. అయితే ఆ కాయిల్ ని సరిగ్గా తాను నిద్రపోయే దగ్గర్లో వెలిగించాడు. ఆ తర్వాత..వెలిగించిన కాయిల్ అద్దిక్ కప్పుకున్న దుప్పటికి అంటుకుంది. దీంతో వేగంగా మంటలు వ్యాపించడంతో.. అద్దిక్ మంటల్లో చిక్కుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ మంటల్లో అతడికి 70-80 శాతం గాయాలయ్యాయని ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఈ దోమల బత్తి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయని, వీటిని పడకకు దగ్గర్లో పెట్టుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని వలన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మస్కిటో కాయిల్స్ ని పడకకు దూరంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ కాయిల్స్ వలన వచ్చే విష వాయువు కంటే దోమతెరలు వాడటం మేలని సలహ ఇస్తున్నారు. మరి, మస్కిటో కాయిల్ వలన ప్రమదం చోటు చేసుకున్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.