iDreamPost
android-app
ios-app

ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రభుత్వ డాక్టర్ దందా.. గుట్టుచప్పుడు కాకుండా ఆ పనులు

  • Published Oct 04, 2024 | 1:20 PM Updated Updated Oct 04, 2024 | 1:20 PM

Kamareddy : ఇండియాలో లింగ నిర్దారణ పరీక్షలు , అబార్షన్స్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయినా సరే ఇప్పటికే పలు హాస్పిటల్స్ లో ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మరొక కేసు వెలుగులోకి వచ్చింది.

Kamareddy : ఇండియాలో లింగ నిర్దారణ పరీక్షలు , అబార్షన్స్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయినా సరే ఇప్పటికే పలు హాస్పిటల్స్ లో ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మరొక కేసు వెలుగులోకి వచ్చింది.

  • Published Oct 04, 2024 | 1:20 PMUpdated Oct 04, 2024 | 1:20 PM
ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రభుత్వ డాక్టర్ దందా.. గుట్టుచప్పుడు కాకుండా ఆ పనులు

అబార్షన్స్ చేయడం.. అర్హత లేని వారు కాన్పులు చేయడం.. లింగ నిర్దారణ పరీక్షలు చేసి పుట్టబోయేది ఎవరో చెప్పడం .. దాని కారణంగా జరిగిన అబార్షన్స్ కోకోల్లలు. ఇవన్నీ చట్ట రీత్యా నేరం. ఇదంతా వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే డబ్బుకు ఆశపడి గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ బోర్డ్ పెట్టి.. MBBS, RMP , PMP లు కాన్పులు చేసిన కేసులు కూడా చాలానే ఉన్నాయి. ఇలా సరైన వైద్యం అందక ఎంతో మంది గర్భిణీ మహిళలు ప్రాణాలు విడిచారు. వీటి పట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా సరే ఎక్కడో ఒక్క దగ్గర గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు చేసే దందా బయటపడింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

లింగ నిర్దారణ పరీక్షలు , అబార్షన్స్ పై నిషేధం ఉన్నా సరే.. అక్కడ అవన్నీ చాలా కామన్. విచ్చల విడిగా కొనసాగుతూనే ఉంటాయి. గుట్టు చప్పుడు కాకుండా కొన్నేళ్లుగా అక్కడ ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ కేసులో పక్క రాష్ట్రం పోలీసుల విచారణలో భాగంగా ఈ వ్యవహారం బయటపడింది. ఈ దందా జరిగేది మరెక్కడో కాదు.. కామారెడ్డి లోని సమన్విత ప్రైవేట్ ఆసుపత్రిలో. ఈ హాస్పిటల్ నడుపుతున్నది ఓ ప్రభుత్వ వైద్యుడు. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఈ హాస్పిటల్ లో లింగ నిర్దారణ పరీక్షలు చేయించుకుని.. అబార్షన్ చేయించుకుంది. దీనితో మహారాష్ట్ర పోలీసులు ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఇక వెంటనే పోలీసులు ఆ హాస్పిటల్ నడుపుతున్న అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా వారిపై సీరియస్ అయింది. ఆ హాస్పిటల్ నిర్వాహకులలో ఒకరు.. ప్రముఖ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్. దీనితో ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే ఆ హాస్పిటల్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. మరో రెండు రోజుల్లో పూర్తి నివేదిక తెలియజేయాలని ఆదేశించారు. దీనితో ప్రస్తుతం స్థానిక ప్రజల నుంచి ఈ విషయంపై వ్యతిరేకత వస్తుంది. గతంలో కూడా అక్కడ ఓ హాస్పిటల్ లో ఇలాంటి సంఘటనలతో పాటు.. శిశు విక్రయాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వార్తా కామారెడ్డిలో తీవ్ర దుమారం రేపింది. 2021 జూలైలో ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు. కానీ మరోసారి అదే యాజమాన్యం ఆసుపత్రి పేరు మార్చి ఇలాంటి దందా కొనసాగిస్తుంది. ఒకప్పుడు కామారెడ్డి అంటే అందరికి రాజకీయాలు గుర్తొచ్చేవి . కానీ ఇప్పుడు భ్రూణ హత్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతుందా? ఇలాంటి దందాలకు ఎప్పుడు చెక్ పడుతుంది ? అనే ప్రశ్నలు తలెత్తున్నాయంటూ.. స్థానిక ప్రజలు వాపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.