P Venkatesh
సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వాటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఏ దరఖాస్తు గడువుతో పాటు పరీక్ష తేదీ షెడ్యూల్ ను మార్చింది. ఆ వివరాలు మీకోసం..
సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వాటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఏ దరఖాస్తు గడువుతో పాటు పరీక్ష తేదీ షెడ్యూల్ ను మార్చింది. ఆ వివరాలు మీకోసం..
P Venkatesh
సోల్జర్స్ కి సమాజంలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రక్షణ రంగంలో మీ పిల్లల్ని సైనికులుగా చూసే అవకాశం వచ్చింది. దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే విద్యార్థులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్. దేశంలో ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. ముందుగా డిసెంబర్ 16తో ముగియనుండగా ఆ తేదీని డిసెంబర్ 20 వరకు ఎన్టీఏ పొడిగించింది. అదే విధంగా పరీక్ష తేదీలో కూడా మార్పులు చేసింది. ముందుగా ప్రవేశ పరీక్షను జనవరి 21 వ తేదీగా నిర్ణయించారు. తాజాగా పరీక్ష తేదీని మార్చి జనవరి 28న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.
దేశంలోని సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు చివరి తేదీ దగ్గరపడుతోంది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అవసరమైన అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే రెడీ చేసే లక్ష్యంతో.. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ (2024-25)లో ఆరో క్లాస్, తొమ్మిదో క్లాస్‌లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9 క్లాసులకు.. కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక స్కూళ్లల్లో నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.