iDreamPost
android-app
ios-app

బర్రెలక్క MLAగా గెలుస్తుందా? కొల్లాపూర్ అసలు లెక్కలు ఇవి!

బర్రెలక్క.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. కారణం.. సోషల్ మీడియాలో ఒక్కేఒక్క వీడియోతో ఫేమస్ అయి.. తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆమె విజయంపై రాజకీయ విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు.

బర్రెలక్క.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. కారణం.. సోషల్ మీడియాలో ఒక్కేఒక్క వీడియోతో ఫేమస్ అయి.. తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆమె విజయంపై రాజకీయ విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు.

బర్రెలక్క MLAగా గెలుస్తుందా? కొల్లాపూర్ అసలు లెక్కలు ఇవి!

తెలంగాణ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మంగళవారంతో మైకులు మూగబోనున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో అనేక విచిత్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. అలానే  ఈసారి  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై అందరిలో ఆస్తకి నెలకొంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇండిపెండెండ్ అభ్యర్థిగా బర్రెలక్క అలియాస్ శిరీష్ పోటీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బర్రెలక్క ఎమ్మెల్యేగా గెలుస్తుందా అనే సందేహం అందరిలో ఉంది. ఆమెకు గెలుపు అవకాశాలు తక్కువేనని, అందుకు కొల్లాపూర్ నియోజవర్గంలో పలు కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంపైనేఉంది. ఇక్కడ నుంచి అధికార బీఆర్ఎస్ తరపున బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు నిరుద్యోగ యువతి బర్రెలక్క ఇక్కడి నుంచి పోటీ  చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసిన బర్రెలక్కే హాట్ టాపిక్. అయితే ఆమెకు సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్ తో ఎన్నికలతో గెలవచ్చని భావించారు.

స్థానిక పరిస్థితులు అందుకు తగినట్లుగా లేవని, సోషల్ మీడియాలో వచ్చే పేరు వేరు.. స్థానికంగా ఉండే పరిస్థితులు వేరని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఈమెకు కేవలం సోషల్ మీడియా పేరు వచ్చిందని, అయితే ఈమె కంటే కాంగ్రెస్,బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా బలమైన వారు. స్థానికంగా బీరం హర్ష వర్ధన్ రెడ్డికి గట్టి ఫాలోయింగ్ ఉంది.  మండలల, గ్రామ స్థాయిలో ఆయనకు గట్టి పట్టుఉంది.  గతంలో కాంగ్రెస్ తరపున గెలిచి.. అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఆయనకు స్థానికంగా గట్టి పట్టు ఉంది.  అదే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొల్లాపూర్ నియోజవర్గంలో మంచి పట్టుంది. ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జూపల్లి కృష్ణారావు.

2018 ఎన్నికల్లో కొల్లాపూర్‌ ఫలితాలను పరిశీలిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. హర్షవర్ధన్‌రెడ్డికి  80,611ఓట్లు రాగా.. జూపల్లికి 68వేల 68ఓట్లు పోలయ్యాయి. 12,543 ఓట్ల మెజార్టీతో హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అలానే బీజేపీ తరఫున పోటీచేసిన ఎల్లేని సుధాకర్‌రావుకు 13వేల 154 ఓట్లు వచ్చాయి.

తాజాగా మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున బలమైన  ఆ నేతలే బరిలో ఉన్నారు. నియోజకవర్గంలోని మండల, గ్రామ స్థాయిలో ఆ  ఇద్దరి నేతలకు ఉన్న పట్టు, ఫాలోయింగ్ బరెలక్కు లేదు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన నేమ్ తోనే గెలవడం అనేది కష్టమని, ఆమె విజయ అవకాశాలు తక్కువేనని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పేరు చూసి.. అదే గెలుపు అనుకుంటే పొరపాటేనని అభిప్రాయ పడుతున్నారు. మరి.. కొల్లాపూర్ నియోజవర్గంలో బర్రెలక్క గెలుపు కష్టమేనని అంటున్నా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.