Krishna Kowshik
Norovirus.. కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకునే క్రమంలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి చెందుతుంది. హైదరాబాద్ మహానగరంలో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. దీంతో GHMC కీలక సూచనలు చేసింది.
Norovirus.. కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకునే క్రమంలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి చెందుతుంది. హైదరాబాద్ మహానగరంలో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. దీంతో GHMC కీలక సూచనలు చేసింది.
Krishna Kowshik
ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ కోవిడ్. 2019 ఎండింగ్ నుండి 2022 వరకు అనేక దేశాలను భయపెట్టింది. ఎంతో మంది ప్రాణాలను హరించింది. అలాగే చావు అంచుల వరకు వెళ్లి బయటకు వచ్చిన వాళ్లున్నారు. ఈ సమయంలో బ్రతుకే ప్రశ్నార్థకం అయ్యింది. ఆ తర్వాత వ్యాక్సిన్లు రావడంతో దీని తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మొన్నటి మొన్న నటుడు అక్షయ్ కుమార్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీని బాధితులైన సంగతి విదితమే. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే ఈ వైరస్ నుండి ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలను మరో వైరస్ భయపెడుతుంది. అదే నోరో వైరస్. ఈ వైరస్ కలుషితమైన పరిసరాలు, నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇది హైదరాబాద్ మహా నగరానికి వ్యాపించడమే కాదు విజృంభిస్తుంది. దీంతో ప్రజలను అలర్ట్ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC).
ప్రస్తుతం ఈ నొరో వైరస్ కేసులు హైదరాబాద్‌లోని యాకత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలీ, మొఘల్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో 100 నుండి 120 కేసులు నమోదైనట్లు చెబుతుంది జీహెచ్ఎంసీ. ఈ వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. కలుషిత నీరు, ఆహారం కారణంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుదని వెల్లడించింది. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేర్కొంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయని చెబుతుంది. అలాగే ఇదో రకమైన అంటు వ్యాధి కావడంతో అప్రమత్తత అవసరమని చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
అలాగే కొన్ని సూచనలు కూడా చేసింది GHMC. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని.. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని పేర్కొంది. ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. కలుషిత నీటితో పాటు నాణ్యత లేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. వానా కాలం కావడంతో సాధారంగా వ్యాప్తించే ఫ్లూ తరహాలోనే ఉంటుందని, కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్‌లు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికలు దీని బారిన పడే అవకాశాలున్నాయని, కిడ్నీపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. విరేచనాలు, వాంతులు, శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవ్వడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందట. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువుగా ఈ వైరస్ బారినపడే అవకాశాలున్నాయట. సో బీ అలర్ట్
నొరోవైరస్ వ్యాధితో జాగ్రత్త!!
కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్.తీసుకోవాల్సిన జాగ్రత్తలు
👉 చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
👉కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
👉ఇంటిని,… pic.twitter.com/n3IcqPC2w6— GHMC (@GHMCOnline) July 27, 2024