KG Chicken Per Rs 100: రూ.100 కే కిలో చికెన్.. క్యూ కట్టిన జనాలు.. ఎక్కడంటే

Chicken: రూ.100 కే కిలో చికెన్.. క్యూ కట్టిన జనాలు.. ఎక్కడంటే

ఆదివారం కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అలాంటిది 100 కే కిలో చికెన్ అంటే.. ఇక జనాలు ఊరుకుంటారా.. ఎగబడతారు. మరి ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడంటే..

ఆదివారం కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అలాంటిది 100 కే కిలో చికెన్ అంటే.. ఇక జనాలు ఊరుకుంటారా.. ఎగబడతారు. మరి ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడంటే..

ఒకప్పుడు మాసాహారం అంటే కేవలం పండగలు, ఇంటికి బంధువులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే వండేవారు. మరి ఇప్పుడు ముక్క లేకపోతే ముద్ద దిగదు చాలా మందికి. ఇక ఆదివారం అయితే మాంసాహారం వండని ఇళ్లు చాలా అరుదని చెప్పవచ్చు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సండే మాత్రం.. చికెన్, మటన్ కచ్చితంగా వండాల్సిందే. పైగా నెల రోజుల క్రితం వరకు కోడి ధర కొండెక్కి కూర్చుంది. కార్తీక మాసం ప్రారంభం అయిన దగ్గర నుంచే చికెన్ రేటు దిగి వస్తోంది. ప్రస్తుతం చికెన్ రేటు 150-200 రూపాయల మధ్య ఉంది. కానీ ఓ చోట మాత్రం 100 రూపాయలకే కిలో చికెన్ అని ప్రకటించారు. ఇంకేముంది జనాలు పోలోమంటూ చేరిపోయి.. పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇంతకు ఎక్కడ ఈ బంపరాఫర్ అంటే..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు చికెన్ సెంటర్లు.. అదిరిపోయే ఆఫర్లు పెట్టాయి. కేవలం వంద రూపాయలకే కిలో చికెన్ అని బోర్డు పెట్టాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నగరమంతా పాకటంతో.. ఆ దుకాణాల వద్దకు క్యూ కట్టారు జనాలు. సాధారణంగా తమ గిరాకీ పెంచుకునేందుకు దుకాణాలు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ.. ఇక్కడ ఈ షాప్ యజమానులు మాత్రం..  తమ అభిమానాన్ని, సంతోషాన్ని చాటుకోవడం కోసం ఈ ఆఫర్ ని ప్రకటించాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. తాము అభిమానించే లీడర్లు గెలిచినందుకుగాను సదరు చికెన్ షాపు యజమానులు ఈ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించారు. ఒకరేమో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ ఆఫర్ ప్రకటిస్తే.. మరొకరేమో.. బీజేపీ అభ్యర్థి గెలుపొందారని ఈ ఆఫర్ పెట్టారు. అసలే ఆదివారం నాడు జనాలు నాన్ వెజ్ తినడానికే ఆసక్తి చూపుతారు. దానికి తోడు.. ఈ ఆపర్లు కూడా ఉండటంతో.. జనాలు దుకాణాలకు బారులు తీరారు. ఇప్పటికే చికెన్ ధరలు కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్న వేళ.. ఒక్కసారిగా 100 రూపాయలకే కిలో ఇస్తామనటంతో ఎగబడ్డారట.

కార్తీక మాసం కావడంతో కోళ్ల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ.. దుకాణాదారులు మాత్రం చికెన్‌ ధరలను తగ్గించకుండా పాత రేటునే  కొనసాగిస్తున్నారు. పేపర్ రేటు ఎలా ఉన్నా.. తాము నిర్ణయించుకున్న ధరలకే అమ్ముతున్నారు. ఇదేంటని అడిగితే.. ఏవో కారణాలు చెప్పి.. కస్టమర్లను మభ్యపెడుతున్నారు. చాలా చోట్ల కిలో చికెన్ 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో 100 కే కిలో చికెన్ అంటే ఆగుతారా.. ప్రస్తుతం ఆ చికెన్ సెంటర్ల దగ్గర కూడా అదే పరిస్థితి ఉందంట.

Show comments