iDreamPost
android-app
ios-app

New Year Celebrations 2024: న్యూ ఇయర్ రోజున అలా చేస్తే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు శిక్ష: హైదరాబాద్ సీపీ

  • Published Dec 23, 2023 | 1:34 PM Updated Updated Dec 23, 2023 | 1:39 PM

త్వరలోనే 2023 ముగిసి.. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఆ వివరాలు..

త్వరలోనే 2023 ముగిసి.. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఆ వివరాలు..

  • Published Dec 23, 2023 | 1:34 PMUpdated Dec 23, 2023 | 1:39 PM
New Year Celebrations 2024: న్యూ ఇయర్ రోజున అలా చేస్తే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు శిక్ష: హైదరాబాద్ సీపీ

మరి కొద్ది రోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. నూతన సంవత్సర వేడుకల కోసం నగరం రెడీ అవుతోంది. డిసెంబర్ 31, 2023 రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నగర వ్యాప్తంగా ఉన్న రిసార్టులు, హోటల్స్ రెడీ అవుతున్నాయి. వేడుకల సంగతి ఎలా ఉన్నా.. న్యూ ఇయర్ పార్టీ అనగానే డ్రగ్స్, మద్యమే గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని.. డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా వదలమని హెచ్చరించారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగం అంశంలో కఠినంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్.

దాంతో న్యూ ఇయర్ వేడుకల్లో.. డ్రగ్స్ వాసన లేకుండా ఉండేలా చేయడం కోసం అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. పబ్బులు, హోటల్స్ కి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ రోజున అలా చేస్తే.. రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష అని హెచ్చరించారు. ఆ వివరాలు..

కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి.. హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటిగంట లోపు న్యూఇయర్ వేడుకలు పూర్తవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పబ్‌లు, బార్లలో డ్రగ్స్ వెలుగు చూసినా, వాడినట్లు తెలిసినా కఠిన చర్యలు తప్పవన్నారు. అలానే ఆ రోజున డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే పదివేల జరిమానా లేదంటే ఆరు నెలల జైలుశిక్ష ఉంటుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

If you do it on New Year's Day, you will be jailed for 6 months

కాగా.. గతంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది వేడుకలకు సంబంధించి.. రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. 31వ తేదీన వేడుకల దృష్ట్యా చాలా ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. అంతేకాకుండా.. పబ్బులు, ఈవెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అలానే ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి గతంలోనే సూచించారు. అంతేకాకుండా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అంతేకాక న్యూ ఇయర్ వేడుకల్లో.. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ దందా పై ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో వేళ్లూనుకుపోయిన డ్రగ్ మాఫియా విచ్చలవిడిగా మత్తు పదార్ధాలు సప్లై చేస్తోంది. న్యూఇయర్ వేడుకలు దగ్గర పడటంతో.. ఇప్పటికే నగరంలోకి భారీ మొత్తంలో డ్రగ్స్ డంప్ చేశారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వ ఉన్నాయనే సమాచారంతో.. అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

అంతేకాక నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైఅలర్ట్ విధించారు.  అంతేకాక డ్రగ్ డ్రాపర్ టెస్టులు చేసేందుకు కూడా టీఎస్‌ న్యాబ్ సిద్ధం అవుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన డ్రగ్ డ్రాపర్ మెషీన్‌లను తెప్పించనున్నారు. న్యూ ఇయర్‌లోపు తెచ్చి అంతటా పరీక్షలు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వీటి ద్వారా లాలాజలం శాంపిల్‌తో క్షణాల్లో డ్రగ్ టెస్ట్ ఫలితాలు వస్తాయి అంటున్నారు.