Dharani
న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతోన్న మందుబాబలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతోన్న మందుబాబలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
కొత్త సంవతసర వేడుకలు అంటే మన దగ్గరే కాదు దేశవ్యాప్తంగా.. ఓరేంజ్ లో ఉంటాయి సెలబ్రేషన్స్. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు సెలబ్రేషన్స్ కొనసాగుతాయి. ఇక 31, జనవరి ఫస్ట్ వేడుకల్లో యువత మరీ ముఖ్యంగా మందుబాబులదే హవా. చుక్క, ముక్కతో సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 31కి వారం, పది రోజుల నుంచే ప్లాన్ చేసుకుంటారు. పార్టీ ఎక్కడ చేసుకోవాలి.. ఎంత మంది వస్తారు.. ఏ బ్రాండ్ మందు కావాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. డిసెంబర్ 31 నాడు వైన్ షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటాయి. రష్ ను దృష్టిలో పెట్టుకుని.. చాలా మంది ముందుగానే మద్యం తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఈ క్రమంలో తాజాగా మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.
డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల టైమింగ్ ను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాక న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా.. బార్లు, క్లబ్బుల్లో పర్మిషన్‌తో జరిగే ఈవెంట్ల కోసం అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశాకె. సాధారణంగా డిసెంబర్ 31న రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటుంది. పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం.. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో డిసెంబర్ 31 నాడు.. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే పోలుసులు చుక్కలు చూపించనున్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నేడు అనగా ఆదివారం రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం అయ్యారు అధికారులు. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. అంతేకాక ఒకటి కంటే ఎక్కువ సార్లు డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన వారికి 15 వేల రూపాయల జరిమానాతో పాటు.. 2 ఎళ్లు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించారు.
అంతేకాక అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా కొత్త సంవత్సర వేడుకలు కొనసాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. ప్రభుత్వ ఈ ఉత్వర్వులతో మందుబాబులు నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే బార్లు, పబ్బుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.