Gold: తెలంగాణ ఆడబిడ్డలకు శుభవార్త.. త్వరలోనే వారికి తులం బంగారం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కారు ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే అర్హులైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కారు ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే అర్హులైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ..  ఎలక్షన్‌ సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా.. మరికొన్నింటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లపై కూడా కసరత్తు చేస్తోంది. అలానే ఆసరా చేయూత పెన్షన్‌ మొత్తాన్ని పెంచి వికలాంగులకు 6 వేల రూపాయలు ఇవ్వడమే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ఇప్పటికే మంత్రి సీతక్క ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆడబిడ్డలకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పనుంది. అర్హులైన వారికి తులం బంగారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం చేయడం కోసం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ పథకం కింద పేదింటి ఆడబిడ్డలకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేవారు. ఆ తర్వాత మరో 50 వేలు పెంచి.. 1,116,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను గెలిపిస్తే.. లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి.. నెలలు గడుస్తున్నా.. ఈ హామీ అమలుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఎందరో ఆడబిడ్డలు ఈ పథకం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై అప్డేట్‌ వచ్చేసింది.

తాజాగా ఈపథకం అమలుపై కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు అనగా జులై 8న తన నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి.. త్వరలోనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో భాగంగా రూ. లక్షతో పాటు తులం బంగారాన్ని అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పన జరుగుతోందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు.

పథకానికి అర్హులు వీరే..

  • పేదింటి ఆడ పిల్లల పెళ్లి ఖర్చులకు ఈ ఆర్థిక సాయం అందజేస్తారు.
  • ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకునేవారు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • పెళ్లి చేసుకునే అమ్మాయికి 18 ఏళ్లు పూర్తి కావాలి. అలానే వరుడికి తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండాలి
  • దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందినవారై ఉండాలి.
  • లబ్ధిదారు కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు.
Show comments