iDreamPost
android-app
ios-app

Hyderabad: హీరో లవర్ లావణ్య డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్! తెరపైకి టాలీవుడ్ ప్రముఖులు?

  • Published Jan 30, 2024 | 2:22 PM Updated Updated Jan 30, 2024 | 2:22 PM

తాజాగా హైదరాబాద్ లో కలకలం రేపిన హీరో లవర్ లావణ్య డ్రగ్స్ కేసులో.. విచారిస్తున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈమెకు పలువురు బాలీవుడ్ స్టార్స్ తో ఉన్న సంబంధాలు, ఇలా పలు రకాల కొత్త విషయాలను పోలీసులు బయటకు తీస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో కలకలం రేపిన హీరో లవర్ లావణ్య డ్రగ్స్ కేసులో.. విచారిస్తున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈమెకు పలువురు బాలీవుడ్ స్టార్స్ తో ఉన్న సంబంధాలు, ఇలా పలు రకాల కొత్త విషయాలను పోలీసులు బయటకు తీస్తున్నారు.

  • Published Jan 30, 2024 | 2:22 PMUpdated Jan 30, 2024 | 2:22 PM
Hyderabad: హీరో లవర్ లావణ్య డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్! తెరపైకి టాలీవుడ్ ప్రముఖులు?

హైదరాబాద్ లో మరో సారి డ్రగ్స్ కలవరపెట్టడంతో. పోలీసులు ఈసారి గట్టిగా నిఘా చర్యలు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఓ యువతి వద్ద మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుని. ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులు ప్రధాన నిందితురాలైన లావణ్య ..ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తిచారు. అయితే, ఈ కేసును విచారిస్తున్న కొద్దీ పోలీసులకు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. లావణ్య సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు.. ఆమె వ్యక్తిగత చాట్స్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఆమె మొబైల్ లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల కాంటాక్ట్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అలాగే చిత్ర పరిశ్రమలో కూడా పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనితో కోర్టు అనుమతి తీసుకుని లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించడానికి సిద్ధమయ్యారు పోలీసులు.

ఈసారి డ్రగ్స్ విషయంలో నిందితురాలు.. ఓ టాలీవుడ్ హీరో లవర్ కావడంతో.. ఈ వార్త మరింత సంచలంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు లావణ్య చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో ముందుకు వెళుతున్న కొద్దీ .. విచారణలో కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయని.. పోలీసులు తేలియజేశారు. దీనితో అసలు ఈ లావణ్య ఎవరు? ఎక్కడినుంచి వచ్చింది? ఇండస్ట్రీకి ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? ఇలా ఆమె బ్యాక్ గ్రౌండ్ అంతా బయటకు లాగుతున్నారు పోలీసులు. వారి విచారణలో భాగంగా తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి. ఆమె హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విజయవాడ నుంచి.. హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ షార్ట్ ఫిలిమ్స్, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలా ఒక హీరోకు లవర్ గా మారింది. ఆ సమయంలోనే ఆమె జల్సాలకు బాగా అలవాటు పడి టాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నించేది. ఇలా పలువురికి డ్రగ్స్ సప్ప్లై చేస్తున్న క్రమంలో పోలీసుల వాళ్లకు చిక్కింది.

కాగా, లావణ్య ప్రస్తుతం కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. అయితే, గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోను, అలాగే మోకిలా డ్రగ్స్ కేసులోనూ ఈమె నిందితురాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా కొంతమంది ల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు , పలువురు సింగర్లు ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఆమెపై పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ పై ఆరా తీస్తున్నారు. ఆమె తనకోసం ఆ డ్రగ్స్ తీసుకుందా లేదా ఎవరికైనా అమ్మడానికి తీసుకుందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా.. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మరింత లోతుగా విచారణ చేపట్టే దిశగా సిద్ధమయ్యారు పోలీసులు. ఇప్పటికే లావణ్య నుంచి కీలక సమాచారం సేకరించారు. అంతేకాకుండా ఈ కేసులు నార్కొటిక్ బ్యూరో అధికారులు సైతం ఆరా తీస్తున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలను వెలికి తెలుసుకుంటున్నారు. ఇక ఈ డ్రగ్స్ కేసు విషయమై పూర్తి వివరాలు పోలీసులు ప్రకటించాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/