Keerthi
ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తుల గిరాకీ బాగా పేరిగిపోయింది. అందువలన నాణ్యత లేని పదార్థాలను వాడుతు అతి తక్కువ ధరలకే ఆహారాన్ని విక్రయిస్తున్నారు. అందుకే ఈ స్ట్రీట్ వ్యాపారస్తుల పై జీహెచ్ ఎంసీ అధికారులు కొత్త రూల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అవి ఏమిటంటే..
ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తుల గిరాకీ బాగా పేరిగిపోయింది. అందువలన నాణ్యత లేని పదార్థాలను వాడుతు అతి తక్కువ ధరలకే ఆహారాన్ని విక్రయిస్తున్నారు. అందుకే ఈ స్ట్రీట్ వ్యాపారస్తుల పై జీహెచ్ ఎంసీ అధికారులు కొత్త రూల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అవి ఏమిటంటే..
Keerthi
ప్రస్తుత కాలంలో స్ట్రీట్ ఫుడ్ గిరాకీ అనేది బాగా పేరిగిపోయింది. వీటికోసం ఇప్పుడు ప్రత్యేకమైన ప్రాంతాలకు వెళ్లలసిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏ వీధిలో చూసిన పాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేవి దర్శనిమిస్తాయి. అంతలా వ్యాపారస్తులు ఈ స్ట్రీట్ ఫుడ్ కోర్టులతో కస్టమర్స్ ని ఆకర్షిస్తున్నారు. అతి తక్కువ ధరకే రకరకాల వంటకాలతో భోజనం లభించడంతో చాలామంది ఉద్యోగస్తులు మధ్యహ్న సమయంలో భారీ సంఖ్యల్లో వెళ్లి అరాగిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉపాధి పనులు చేసుకునే క్యాబ్, ఆటో రిక్షా నడిపేవారు సైతం ఈ స్ట్రీట్ ఫుడ్ నే ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ హైదరాబాద్ మహానగరంలోని ఆహార ప్రియుల కోసం డీఎల్ ఎఫ్ లాంటి స్ట్రీట్స్ ను ఏర్పాటు చేసిన అక్కడ అధిక రేట్లు ఉండటంతో.. సామాన్యులు అంతా ఈ స్ట్రీట్ ఫుడ్ కోర్టుల పై ఆధారపడతున్నారు. ఈ క్రమంలోనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తుల పై జీహెచ్ ఎంసీ అధికారులు కొత్త రూల్స్ ను జారీ చేశారు. అవి ఏమిటంటే..
ఇటీవలే స్ట్రీట్ ఫుడ్ విక్రయిస్తున్న కుమారి అంటీ సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం చాలామంది ఫుడ్ లవర్స్ భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్ల పై ట్రాఫిక్ రద్దీ కావడంతో.. కుమారి అంటీ ఫుడ్ బిజినెస్ ను క్లోజ్ చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం పై స్పందించి మళ్లీ కుమారి అంటీ బిజినెస్ ను రీ ఓపెనింగ్ చేయించడం జరిగింది. ఇదిలా ఉంటే.. కుమారి అంటీ లాంటి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులు నగరంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరీ కోసం జీహెచ్ ఎంసీ అధికారులు కొత్త రూల్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు.
చాలామంది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులు క్వాలిటి లేని ఫుడ్ ని, సరైన పదార్థాలు వాడకుండా అతి తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. దీంతో అతి తక్కువ ధరకే మంచి టేస్టీ ఫుడ్ అందుబాటులో ఉండటంతో.. కస్టమర్లు భారీ సంఖ్యలో ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు తరలి వెళ్తున్నారు. కానీ , వీటిని తినడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి వ్యాపారస్తులకు గుర్తింపు కార్డును ఇస్తే బాగుంటుందని జీహెచ్ ఎంసీ అధికారులు బావిస్తున్నారు. అంతేకాకుండా.. వారిని ఫుడ్ సేప్టీ అధికారులతో తనిఖీలు చేసి ఆహారంలో నాణ్యత పాటించేలా సూచించాలని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులకి మరిన్ని స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటందని సూచిస్తున్నారు. మరి, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తలకు జీహెచ్ ఎంసీ అధికారులు తెచ్చే కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.