iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. మంత్రి కీలక ప్రకటన!

  • Published Apr 20, 2024 | 4:26 PM Updated Updated Apr 20, 2024 | 4:26 PM

New Ration Cards: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.

New Ration Cards: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.

గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. మంత్రి కీలక ప్రకటన!

గత ఏడాది చివరల్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు కీలయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగమైన మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర పథకాలు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ఎన్నో దరఖాస్తులు వచ్చాయి. తాజాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు విషయంపై మంత్రి కీలన ప్రకటన చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పద్నాలు సీట్లు గెలవాలని అధికార పార్టీ కాంగ్రెస్ గట్టి పట్టుమీదే ఉంది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి తమ ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం కొండంత ఎదురు చూపు చూస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను పొందడానికి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో జనం దృష్టంతా కొత్త రేషన్ కార్డులపైనే ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. సీఎం రేవత్ రెడ్డి కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్దం చేయాలని అధికారును ఆదేశించారు’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం చేపట్టిన వివిధ పథకాల ద్వారా లబ్దిపొందేందుకు గాను ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రజా పాలనలో దాదాపు 20 లక్షల మంది వరకు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.