iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్ కార్డులు,హెల్త్‌ కార్డులు జారీ! ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్

  • Published Aug 09, 2024 | 2:06 PM Updated Updated Aug 09, 2024 | 2:06 PM

తెలంగాణ రాష్టంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డు జారీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్టంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డు జారీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Aug 09, 2024 | 2:06 PMUpdated Aug 09, 2024 | 2:06 PM
కొత్త రేషన్ కార్డులు,హెల్త్‌ కార్డులు జారీ! ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇచ్చిన హామిలను నేరవేచ్చే క్రమంలో శరవేగంగా ముందకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం కోసం ఎప్పటికప్పడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ పలు సమావేశాల్లో కొత్త రేషన్ కార్డులపై ప్రస్తావన తెస్తూ.. కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా తెలంగాణలోని కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కార్డుల జారీ ప్రక్రియ, నియమ నిబంధనలు కోసం మంత్రి వర్గ ఉపసంఘాన్ని తాజాగా ఏర్పాటు చేశారు.అయితే ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి తెలంగాణ సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహలను సబ్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 8) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆ సమావేశంలో.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్‌ కార్డులు అనేవి వేర్వేరుగా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా… వీటికి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలన్న విషయంపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల అసెంబ్లీ సీఎం రేవంత్ ప్రకటించారు. ఇందులో భాగంగానే తాజాగా.. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ సభ్యుల విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి వివరాలు అందించనుంది.

ఇక ఈ కొత్త రేషన్ కార్డుల గురించి గత ప్రభుత్వం ప్రభుత్వ హయాం నుంచి కూడా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వారిలో కటుంబాల నుంచి వేరు పడినవారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే.. ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలతో సహా.. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీంలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో రేషన్ కార్డులు లేని వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా.. అర్హులు మరో 20-30 లక్షల కుటుంబాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా.  ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను అర్హులనే ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.