రైతులకు అదిరిపోయే శుభ వార్త చెప్పిన రేవంత్ సర్కార్.. మరోసారి..

Great News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. నాటి నుంచి రైతులకు వరుస గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు.

Great News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. నాటి నుంచి రైతులకు వరుస గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు.

గత సంవత్సరం చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లుగా పాలన కొనసాగిస్తూ వస్తున్నా బీఆర్ఎస్ ని గద్దె దింపింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు,రైతులు, నిరుద్యోగులు, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. వాటిపై నమ్మకంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు తెలంగాణ ప్రజలు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కృషి చేస్తుంది. ఇటీవల వర్షాలు పడితే పంటనష్టం అందించారు. రెండు లక్షల రుణమాఫీ కింత ఇప్పటికే లక్షన్నర మాఫీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులకు మరో గొప్ప శుభవార్త అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రైతులకు శుభవార్త. త్వరలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఇకపై ఏ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదని చెప్పారు. చెప్పిన ప్రకారం ఇటీవల రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. గత నెల లక్షన్నర చేయగా.. ఆగస్టు 15లోపు మిగతావి పూర్తి చేస్తామని అన్నారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడు లేనంతగా బ్యాంకింగ్ రికవరీ జరిగిందని.. దాని వల్ల బ్యాంకులకు మంచి ఉపయోగం ఉందని తెలిపారు. ఇ్పుడు రుణమాఫీ యిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా తనదైన సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నామని.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని పలు సందర్భాల్లో అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని, ఆరు గ్యారెంటీా పథకాల్లో మిగతా పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మాట్లాడారు. కొత్త రుణాలు ఇవ్వాలన్న ఆదేశాలపై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments