Keerthi
కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన అమృత్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు మరికొన్ని స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మరో కొత్త రైల్వే వంతెన అనేది అందుబాటులోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన అమృత్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు మరికొన్ని స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మరో కొత్త రైల్వే వంతెన అనేది అందుబాటులోకి వచ్చింది.
Keerthi
దేశంలో చిన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయలనే దిశగా.. కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చూట్టింది. దీంతో చిన్న రైల్వే స్టేషన్లలో సైతం ప్రయాణీకులకు మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు ఇటీవలే అమృత్ భారత్ స్టేషన్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. కాగా, ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకం అనేది భారతీయ రైల్వే నెట్‌వర్క్ అంతటా రైల్వే స్టేషన్‌లను మెరుగుపరచడం, ఆధునీకరించడంమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ పథకం కింద ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థలో మొత్తం 1275 స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 39 స్టేషన్లనలో.. అభివృద్ధి చేసేందుకు మెుదటి విడతలో 21 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. అయితే ఇప్పడు మరికొన్ని స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే.. తాజాగా మరో కొత్త రైల్వే వంతెన అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లు ఇప్పటికే అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరికొన్ని స్టేషన్లలో అభివృద్ధి పనులు జరగుతున్నాయి. అయితే తాజాగా హనుమకొండ జిల్లా వడ్డేపల్లి కొత్త రైల్వే వంతెన అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే.. ఉనికిచెర్ల మార్గం సమీపంలో నిర్మిస్తున్న సొరంగం పైనుంచి శుక్రవారం గూడ్స్ రైళ్లను విజయవంతంగా నడిపించారు. ఇక హసన్‌పర్తి నుంచి కాజీపేటకు వచ్చే ట్రైన్లు అనేవి నేరుగా రావడానికి రూ.36 కోట్లతో కూడిన టన్నెల్ నిర్మాణం చేపట్టారు. అయితే హసన్‌పర్తి రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే రైళ్లు కొత్తగా నిర్మించిన ఈ టన్నెల్ పైభాగం నుంచి నేరుగా వెళ్తాయి. కాగా, హసన్‌పర్తి రోడ్డు నుంచి కాజీపేటకు వచ్చే ట్రైన్లు మాత్రం.. టన్నెల్ ద్వారా వడ్డేపల్లి చెరువు పక్క నుంచి కాజీపేటకు వెళ్లనున్నాయి. ఇక వారం రోజులుగా ఇంజినీరింగ్, ఎస్‌అండ్‌టీ, ఆపరేటింగ్, ఓహెచ్ ఈ విభాగాల అధికారులు.. సిబ్బంది టన్నెల్ పైభాగాన ఉన్న పాత రైలు పట్టాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త ట్రాక్ అనేది నిర్మించారు.
ఇక నిన్న అనగా శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హసన్‌పర్తి- వరంగల్ మార్గంలో.. రైళ్ల రాకపోకలను నిలిపివేసి కొత్త విద్యుత్తు తీగలను మార్చారు. కాగా, మధ్యాహ్నం 12.50 గంటలకు హసన్‌పర్తి రోడ్డు నుంచి ఫుల్ లోడ్‌తో ఉన్న గూడ్సు రైళ్లను ఈ కొత్త ట్రాక్ మీదుగా విజయవంతంగా నడిపారు. అయితే, 1140 మీటర్ల పొడవైన ఈ ట్రాక్‌లో.. 340 మీటర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే మిగిలిన పనులు త్వరాగ పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. మరి, తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రైల్వే వంతెన అనేది ప్రారంభమవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.