Holiday On January 1s: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. జవనరి 1న అన్ని స్కూళ్లు, బ్యాంకులకు సెలవు

నూతన సంవత్సరం వేడుకుల సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లు, బ్యాంకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 న సెలవు ప్రకటిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

నూతన సంవత్సరం వేడుకుల సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లు, బ్యాంకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 న సెలవు ప్రకటిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

మరి కొన్ని రోజుల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. 2024 కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నాం. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో.. నగరంలో అనేక ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒంటి గంట వరకు పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచవచ్చని.. కాకపోతే అందుకుగాను ముందుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.

అంతేకాకుండా న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10 వేల రూపాయల జరిమానా లేదంట 6 నెలల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.  అలానే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..

జనవరి 1వ పాఠశాలలకు సెలవు..

నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1వ తేదీన పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు.. తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 సెలవుకు బదులుగా.. ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతేకాక న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా పార్టీలు నిర్వహించేవారు, పబ్బులు, క్లబ్బులు, ఇతర ఈవెంట్ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తెలిసినా.. అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

బ్యాంకులకు కూడా సెలవు..

కొత్త సంవత్సరం సందర్భంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద తెలంగాణలోని బ్యాంకులకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1వ తేదీన సెలవు కాకుండా, జనవరిలో మరో మూడు సెలవులను కూడా రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. వీటన్నింటినీ సాధారణ సెలవుల్లో జాబితాలో చేర్చారు.

Show comments