Arjun Suravaram
Indiramma Houses In Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ యాప్ రానున్నట్లు సమాచారం.
Indiramma Houses In Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ యాప్ రానున్నట్లు సమాచారం.
Arjun Suravaram
గతేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. ఆ తరువాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో పలు హామీలను గుప్పించింది. మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్ పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే ఇటీవలే రైతు రుణ మాఫీ కూడా పూర్తయ్యింది. ఇదే సమయంలో ఎంతో మంది ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధివిధానాలను త్వరలోనే విడుదల చేయనుందని సమాచారం. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్త యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం వారం లేదా పది రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ లో మొదటిసారి ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రభుత్వం పలు అంశాలపై ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ దరఖాస్తుల్లో ఇళ్ల కోసం దాదాపు 82 లక్షలు వచ్చాయి. వాటిల్లో అర్బన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్ పరిధిలో 58.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా? కాదా? అనేది తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి నిర్దారించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన, తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం గ్రామం, పట్టణం, మున్సిపాలిటి, వార్డులకు అధికారులు వెళ్లి ధ్రువీకరించనున్నారు. నిజమైన అర్హులను గుర్తించేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫార్మాట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. ఆధార్, తెల్ల రేషన్ కార్డులను పరిశీలిస్తారు. వాటి ఆధారంగా గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు. అనంతరం ఇంటి స్థలంకు సంబంధించి పలు వివరాలను తీసుకుంటారు. ఒకవేళ ఇంటి స్థలం లేనివారికి ఇంటి స్థలం ఇవ్వాలని ఫ్రొ ఫార్మాలో సమాచారం నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకోనున్నట్టు తెలిసింది.
ఇది ఇలా ఉంటే.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలానే రెండో విడతలో స్థలం లేనివారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, అదేవిధంగా స్థలం లేనివారికి స్థలం ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీను నిరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.
ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్లు పథకం సక్రమంగా అమలు అయ్యేందుకు ఒక యాప్ రానుందని తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం కోసం కొత్త యాప్ తీసుకురావాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అర్హుల గుర్తింపు, ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం మంజూరు వరకు మొత్తం ప్రక్రియనూ ఆ యాప్ ద్వారా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేంద్రం కూడా ఒక యాప్, పోర్టల్ ను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారానే ఈ పథకాన్ని అమలు చేద్దామా? లేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేద్దామా? అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.