Keerthi
నగరవాసులకు సంస్కృతి కొత్తమీ కాదు.. ఎందుకంటే.. ఎప్పటి నుంచి ఈ మాల్స్ ట్రెండ్ అనేది కొనసాగుతునే ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే నగరంలో చాలా మాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నగరంలో మరో నేషనల్ మార్ట్ ను ఓపెన్ చేయడం జరిగింది ఇంతకి ఎక్కడంటే..
నగరవాసులకు సంస్కృతి కొత్తమీ కాదు.. ఎందుకంటే.. ఎప్పటి నుంచి ఈ మాల్స్ ట్రెండ్ అనేది కొనసాగుతునే ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే నగరంలో చాలా మాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నగరంలో మరో నేషనల్ మార్ట్ ను ఓపెన్ చేయడం జరిగింది ఇంతకి ఎక్కడంటే..
Keerthi
ప్రస్తుత నగరంలోని జనాభతో పాటు మాల్స్ సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎన్నాడు లేని విధంగా ఇప్పుడు ఈ మాల్స్ డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఎందుకంటే..ఇప్పుడు చాలామంది నిత్యవసర సరుకులు దగ్గర నుంచి ఎలక్ట్రాకిల్ వస్తువులు వరకు ఇలా ప్రతిది షాపింగ్ మాల్స్, డిమార్ట్స్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే మొదట్లో ఎక్కువ సంపాదన ఉన్న వాళ్లు మాత్రమే ఈ మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరూ ఈ మాల్స్ లో షాపింగ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మాల్స్ డిమాండ్ అనేది చాలా ఎక్కువైంది.
ఇకపోతే నగరవాసులకు ఈ మాల్స్ సంస్కృతి కొత్తమీ కాదు.. ఎందుకంటే.. ఎప్పటి నుంచి ఈ మాల్స్ ట్రెండ్ అనేది కొనసాగుతునే ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే నగరంలో జీవీకే, ఫోరంమాల్, ఇనార్బిట్ మాల్, పీవీఆర్ ఐమాక్స్, నెక్ట్స్ గలేరియా, అశోక 1, డీమార్ట్, రత్న దీప్, మోర్, జియో మార్ట్, లులు మాల్స్ వంటివి ఉన్నాయి.ఇక వాటిలో నిత్యం చాలామంది షాపింగ్ చేస్తుంటారు. అసలు ఒక్కరోజు కూడా మాల్స్ అనేవి జనసాంద్రత లేకుండా ఖాళీగా ఉండటం అంటూ జరగదు.ఇలాంటి సమయంలో తాజాగా నగరవాసులకు మరో శుభవార్త అందింది. ఎందుకంటే.. నగరంలో నిత్యావసర వస్తువులు విక్రయించే నేషనల్ మార్డ్ తాజాగా ఓపెన్ అయ్యింది.
కాగా, ఈ మార్ట్ ను మేడ్చల్ లో 40 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎఫ్ఎంసీజీతో పాటు నిత్యావసర వస్తువులను విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ మార్ట్ లో కిరాణాతోపాటు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయోన్సెన్, కుక్ వేర్, పాదరక్షలు, దుస్తులు వంటివి సరసమైన ధరలకు అందిస్తున్నానమని ఆ నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అగర్వాల్ చెప్పారు. అలాగే స్టైల్ మార్ట్ పేరుతో సొంత బ్రాండ్ దుస్తులను అమ్ముతున్నామని పేర్కొన్నారు. అయితే ఇలా నిత్యవసర వస్తువులు దగ్గర నుంచి బ్రాండెడ్ దుస్తులు, పాదరక్షలు వరకు అన్ని ఈ నేషనల్ మార్ట్ లో సరసమైన ధరకు దొరకడమనేది నిజంగా నగరవసులకు ఒక పండగలాంటి వార్తనే చెప్పవచ్చు. మరి, అన్ని రకాల వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండే ఈ నేషనల్ మార్ట్ మేడ్చల్ లో ఓపెన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.