iDreamPost
android-app
ios-app

26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నఆ ఇద్దరు నేతలు!

రాజకీయాల్లోకి యువత రావాలంటూ  తరచూ ఎందరో నేతలు తమ ప్రసంగాల్లో  చెబుతుంటారు. కానీ వాస్తవంగా చూస్తే.. రాజకీయ పార్టీల్లో అలాంటి వాతావరణం కనిపించదు. కానీ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ఇద్దరు యువ నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారి వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే..

రాజకీయాల్లోకి యువత రావాలంటూ  తరచూ ఎందరో నేతలు తమ ప్రసంగాల్లో  చెబుతుంటారు. కానీ వాస్తవంగా చూస్తే.. రాజకీయ పార్టీల్లో అలాంటి వాతావరణం కనిపించదు. కానీ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ఇద్దరు యువ నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారి వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే..

26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నఆ ఇద్దరు నేతలు!

రాజకీయాల్లోకి యువత రావాలంటూ  తరచూ ఎందరో నేతలు తమ ప్రసంగాల్లో  చెబుతుంటారు. అంతేకాక యువతకు పెద్ద పీఠ వేసింది.. మా పార్టీ అంటే పార్టీ.. అని నేతలు తెగ చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా చూస్తే.. రాజకీయ పార్టీల్లో అలాంటి వాతావరణం కనిపించదు. ఏళ్ల తరబడి కొందరు నేతలే ఎన్నికల్లో పోటీ చేస్తూ.. యువతకు అవకాశం లేకుండా చేస్తుంటారు. అయితే పలు సందర్భాల్లో కొందరు యువత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా పోటీ చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ 30 ఏళ్ల లోపు ఉన్నఓ ఇద్దరు నేతలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలో దిగుతున్నారు. ఎవరు ఆ ఇద్దరు, ఎంటి వారి నేపథ్యం..

తెలంగాణలో ఎన్నికల వాతారవరణం రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారి కోసం అధినేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో చాలా వరకు అందరూ పాత వాళ్లే పోటీ చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ముఖాలు పోటీల్లో కనిపిస్తున్నాయి. ఓ ఇద్దరు నేతలు అయితే కేవలం 26 ఏళ్ల వయస్సుకే ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరు  సీనియర్ నాయకుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్. మరొకరు పాలకుర్తి నుంచి కాంగ్రెస్ తరపున 26 ఏళ్ల యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు.

మైనంపల్లి రోహిత్ ను మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు మెదక్ టికెట్ లభించకపోవడంతో మైనంపల్లి హనుమంతరావు మనస్తాపం చెందారు. దీంతో తన కొడుకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీలో ఉండనంటూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో తండ్రి కొడుకులను చేరదీసిన  కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటును రోహిత్‌కు, మల్కాజిగిరి సీటును హనుమంతరావుకు ఇచ్చింది.  ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన రోహిత్ వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యంత చిన్న వయసు రోహిత్ కావడం విశేషం.

ఇక హనుమాండ్ల యశస్విని రెడ్డి విషయానికి వస్తే.. ఆమె 1985 నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటమంటే ఎరుగని.. 37 ఏడేళ్లగా ఎమ్మెల్యే, మంత్రిగా అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుపైన పోటీ చేయనున్నారు. వాస్తవానికి ఈమె పోటీ చేసే స్థానం నుంచి వాళ్ల అత్తగారైన ఝాన్సీ రెడ్డి నిలబడాల్సి ఉంది. కానీ ఆమె ఎన్నారై కావడం, భారత పౌరసత్వం కోసం పెట్టిన అప్లికేషన్ పెడింగ్ లో ఉంది. దీంతో  రానున్న రోజుల్లో ఇబ్బందులు రాకుండా యశస్విని రెడ్డిని నిల్చబెట్టారు.

ఈమె వయసు కూడా 26 ఏళ్ళే అయినప్పటికీ రోహిత్ కన్నా కొన్ని నెలలు పెద్దది. అయితే వీరిద్దరూ వయసులో చిన్న అయినప్పటికీ.. వారికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగానే సీటు వచ్చిందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అత్యంత చిన్న వయసులోనే సీటు సాధించిన ఇద్దరు గెలుస్తారా లేదా అనే ఫలితం కోసం డిసెంబర్ 3 వరకు ఎదురు చూడక తప్పదు. మరి… ఇలా అతి చిన్న వయస్సులోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.