వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు.. KTR ప్రశంస

కుల, మత, జాతి బేధాలు ఉన్నప్పటికీ.. దేశంలో ప్రజలంతా ఐక్యంగా జీవిస్తున్నారు. హిందు- ముస్లిం భాయ్ భాయ్ అంటూ బతుకుతున్నారు. అలాగే మత సామరస్యాన్ని చాటుతున్నారు. అందుకు ఉదాహరణ ఈ ఘటన

కుల, మత, జాతి బేధాలు ఉన్నప్పటికీ.. దేశంలో ప్రజలంతా ఐక్యంగా జీవిస్తున్నారు. హిందు- ముస్లిం భాయ్ భాయ్ అంటూ బతుకుతున్నారు. అలాగే మత సామరస్యాన్ని చాటుతున్నారు. అందుకు ఉదాహరణ ఈ ఘటన

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. కుల, మత, జాతి బేధాలు ఉన్నప్పటికీ.. ఐక్యంగా జీవిస్తున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. భాయ్..భాయ్ అంటూ బతుకుతున్నారు. అంతే కాదు మత సామరస్యాన్ని చాటుతున్నారు. హిందు పండుగలను ముస్లిం, క్రిస్టియన్స్ జరుపుకుంటారు. అలాగే ముస్లిం పండుగలప్పుడు మిగిలిన వాళ్లు విషెస్ తెలియజేస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా ఇదే నిరూపితమైంది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరోసారి మత సామరస్యం పరఢవిల్లింది. వినాయక చవితి పందిళ్లను ఏర్పాటు చేసిన దగ్గర నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ముస్లిం సోదరులు. తీర్థ ప్రసాదాలు స్వీకరించడం దగ్గర నుండి నిమజ్జన వేడుకల వరకు అన్నింటిల్లోనూ భాగస్వామ్యం అయ్యారు.

వినాయక చవితి అంటే గణేశుని విగ్రహంతో పాటు ఆయనకు సమర్పించే లడ్డుకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ లడ్డూ వేలం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఈ వేలంలో హిందు భక్తులు పాల్గొంటారు. కానీ ముస్లింలు కూడా ఇది తమ పండుగలా భావించి ఈ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ముస్లిం దంపతులు, మహా ప్రసాదాన్ని దక్కించుకుని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. వారిలో ఒకరు అప్జల్- ముస్కాన్ దంపతులు. ఆ దంపతులదీ ఎక్కడంటే ఆసిపాబాద్ జిల్లా కాగజ్ నగర్. పరమత సహనం చాటి పది మందికి ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ‘గంగా జమునా తహజీబ్’ అంటూ ప్రశంసించారు. అసలైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టారని ముస్లిం దంపతులను కొనియాడారు కేటీఆర్.

కాగజ్‌‌నగర్‌‌ మండలం భట్పల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పూజల అనంతరం వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా.. చాలా మంది ఔత్సాహికులు పార్టిసిపేట్ చేశారు. అదే గ్రామానికి చెందిన అఫ్జల్- ముస్కాన్ దంపతులు సైతం ఈ ఆక్షన్‌లో పాల్గొన్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వేలం పాటలో ముస్లిం దంపతులు రూ. 13, 216కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు. అలాగే ఈ లడ్డూ ప్రసాదాన్ని వారి ఇంటిలోకి తీసుకెళ్లి.. స్వీకరించడమే కాదు.. బంధువులకు, చుట్టాలకు, స్థానికులకు పంచి పెట్టారు. అలాగే ఖమ్మం మండలం ఆరెంపుల గ్రామంలో కూడా లడ్డూ వేలం వేయగా.. ముస్లిం దంపతులు దాదా సాహేబ్,షమీ పాల్గొని.. రూ. 23, 500లకు దక్కించుకున్నారు. తమకు కుల, మతాల బేధాలు లేవని, ఇలాంటి కట్టుబాట్లకు అతీతంగా హిందూ- ముస్లిం సోదర భావంతో జీవిస్తున్నారు.

Show comments