iDreamPost
android-app
ios-app

తెలంగాణకు అండగా అంబానీ.. వరద బాధితులకు భూరి విరాళం..

ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి విదితమే. రోడ్డు, జాతీయ రహదారులే కాదు.. నగరాలను నీట ముంచాయి వానలు, వరదలు, దీంతో చలించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా..

ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి విదితమే. రోడ్డు, జాతీయ రహదారులే కాదు.. నగరాలను నీట ముంచాయి వానలు, వరదలు, దీంతో చలించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా..

తెలంగాణకు అండగా అంబానీ.. వరద బాధితులకు భూరి విరాళం..

ఈ మధ్య కాలంలో వరుణుడు తన ప్రకోపాన్ని చూపించాడు. రెస్ట్ తీసుకోకుండా డ్యూటీ చేసి ఎడతెరిపి లేకుండా వానలు కురిపించాడు. తడిసి ముద్దవుతున్నాం అనుకునేలోగా.. తన ప్రతాపాన్ని కనబర్చాడు. వెరసి రెండు తెలుగు రాష్ట్రాలు నీట మునిగాయి. తెలంగాణలోని ఖమ్మం, మహాబూబాబాద్, అటు ఏపీలోని విజయవాడ నగరం నీట మునిగాయి. రహదారులే కాదు ఇళ్ల్లోకి కూడా పీకల్లోతు నీళ్లు చేరడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు చవిచూశారు ప్రజలు. ఈ ప్రకృతి విలయం విలాపాన్ని మిగిల్చింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. సర్వస్వం కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సరైన గూడు, నీడ, నిద్ర, తిండి లేక నానా అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ఎటు చూసినా హృదయ విదారకమైన దృశ్యాలే కనిపించాయి. ఆ సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చింది సినీ ఇండస్ట్రీ.

వీరి స్ఫూర్తితోనే ఎంతో మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, విద్యా సంస్థలు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. ఇంకా సీఎం సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా.. తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీ ముందకు వచ్చింది. తమ వంతు సాయంగా భూరి విరాళాన్ని ప్రకటించింది. తెలంగాణ వరదల నిమిత్తం సీఎం సహాయనిధికి రూ. 20 కోట్లను అందిస్తామని ప్రకటించారు ఆ సంస్థ వ్యవస్థాపకులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ. ఇప్పుడు వీరి తరుఫున ఆ విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు సంస్థ ప్రతినిధులు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పీవీఎల్ మాధవరావులు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సంస్థ తరపున విరాళంగా రూ.20 కోట్లు చెక్కును సీఎం రేవంత్‌కు అందజేశారు. రిలయన్స్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఇప్పటి వరకు అందిన విరాళాల్లో ఇదే హయ్యెస్ట్ అని తెలుస్తోంది. కాగా ఇంకా సీఎం సహాయనిధికి డొనేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల మహేష్ బాబు- నమ్రత దంపతులు.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వరద బాధితుల సహాయార్థం రూ. 50 వేల చెక్ అందజేసిన సంగతి విదితమే. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి స్టార్స్ విరాళాలు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని ఫ్లడ్ విక్టిమ్స్ కోసం వదలుకున్నారు. స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సంఘం కూడా రూ.5 కోట్ల విరాళంగా అందజేసింది. అలాగే పలు విద్యా సంస్థలు సైతం సీఎం సహాయనిధికి విరాళాలు అందజేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించిన విరాళంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.