Uppula Naresh
Uppula Naresh
వరంగల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బిడ్డకు పాలిచ్చి గుండెపోటుతో తల్లి మృతి చెందింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంంలో బుస్స సుష్మిత (25) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే సుష్మితకు మొదటి కాన్పు కావడంతో ప్రసూతి కోసం ఈ నెల 13న వరంగల్ లోని ఓ ఆస్పత్రిలో చేరింది. కాగా, అదే రోజు సిజేరియన్ ద్వారా ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది.
కుమారుడు పుట్టడంతో సుష్మిత, భర్త, కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు. సుష్మిత ఆరోగ్యంగా ఉండడంతో వైద్యులు ఈ నెల 18న ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు.ఇదిలా ఉంటే..శుక్రవారం తెల్లవారు జామున ఆ బిడ్డ పాల కోసం ఏడ్చింది. దీంతో సుష్మిత ఆ శిశువుకు పాల పట్టించి వచ్చి మళ్లీ నిద్రపోయింది. కట్ చేస్తే.. అదే రోజు ఉదయం ఆ బిడ్డ పాల కోసం మారోసారి ఏడ్చాడు. దీంతో అక్కడే ఉన్న సుష్మిత తల్లి ఆమెను నిద్రలేపే ప్రయత్నం చేసింది. కానీ, ఆ బాలింత ఎంతకు నిద్రలేవలేదు.
ఇక ఆ తల్లి ఖంగారుపడి వెంటనే వైద్యులను పిలవడంతో వారు పరిశీలించగా.. సుష్మితకు నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ రావడంతో మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, భర్త గుండెలు పగిలేలా ఏడ్చారు. కొడుకు పుట్టిన 5 రోజులకే తల్లి మరణించడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. కొడుకు పట్టిన 5 రోజులకే గుండెపోటుతో మరణించిన తల్లి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన