iDreamPost
android-app
ios-app

వర్షాలు ఇక లేనట్టే.. వచ్చే వారం నుంచి మరింత ముదరనున్న ఎండలు!

  • Published Apr 24, 2024 | 8:00 AM Updated Updated Apr 24, 2024 | 8:00 AM

Telangana Weather Report: ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Telangana Weather Report: ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వర్షాలు ఇక లేనట్టే.. వచ్చే వారం నుంచి మరింత ముదరనున్న ఎండలు!

మార్చి నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఏప్రిల్ లో భానుడి ప్రతాపానికి జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం చుక్కలు చూపిస్తుంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తుంది. ఎండ తాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతలపానియాల వెంట పరుగులు తీస్తున్నారు. వడదెబ్బతో పలువురు కన్నుమూశారు. నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షలు పడి కాస్త చల్లబడ్డా.. ఇప్పట్లో ఇక వర్షాలు లేనట్టే అంటున్నారు. అంతేకాదు మరో వారం రోజుల్లో ఎండలు భారీగా పెరిగిపోయే సూచన ఉందని అంటున్నారు వాతావరణశాఖ అధి‌కా‌రులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోతూ వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల వ్యవధిలో పలు చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆకాశం మేఘావృతమై చిన్నపాటి చిరు జల్లులు పడే అకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వారంలో వర్షాలకు బ్రేక్ పడనున్నట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో వారంలో ఇక వర్షాలకు గుడ్ బై చెప్పాల్సిందే. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సీయస్ నుంచి 45 డిగ్రీల వరకు పెరిగే సూచన ఉందన హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో వారం రోజుల తర్వాత ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలయ్యాయి.. మళ్లీ ఎప్పటి లాగే ఎండలు మొదలయ్యాయి. మరో వారం తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణం అంచనా వేసింది. వచ్చే వారం రోజుల్లో గరిష్ణ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రకటించింది. ఖాజాగూడలో 42.9, బన్సలాల్ పేటలో 42.8 డిగ్రీలు నమోదు అయ్యింది. నల్లగొండ జిల్లాలో టిక్య తండాలో ఏకంగా 45 డిగ్రీల సెల్సీయస్ నమోదు అయ్యింది. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, మంచిర్యాలు, నిజామాబాద్, జిగిత్యాల్, నిర్మల్, కామారెడ్డి లో తెలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.