ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో మియాపూర్ SI అసభ్య ప్రవర్తన

ప్రజలు ప్రశాంతంగా కంటి మీద కునుకు వేయగలుగుతున్నారంటే దానికి కారణం పోలీసు వ్యవస్థ. తిండి, తిప్పలు మానేస్తూ.. సమస్య ఉన్న చోటల్లా వెళ్లి.. వాటిని పరిష్కరిస్తూ.. ప్రజలతో జైజైలు పలికించుకుంటూ ఉంటారు పోలీసులు. కానీ కొంత మంది వల్ల..

ప్రజలు ప్రశాంతంగా కంటి మీద కునుకు వేయగలుగుతున్నారంటే దానికి కారణం పోలీసు వ్యవస్థ. తిండి, తిప్పలు మానేస్తూ.. సమస్య ఉన్న చోటల్లా వెళ్లి.. వాటిని పరిష్కరిస్తూ.. ప్రజలతో జైజైలు పలికించుకుంటూ ఉంటారు పోలీసులు. కానీ కొంత మంది వల్ల..

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ.. వారి భద్రతకు భరోసానిస్తూ.. 24/7 సేవలందిస్తూ ఉంటారు పోలీసులు. వీరి దగ్గరకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంటుంది. కానీ కొంత మంది చీడ పురుగుల వల్ల పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. తమ బాధలు ఇవి అని ఆశ్రయిస్తున్న బాధితుల్ని మరింత బాధపెడుతున్నారు కొంత మంది రక్షక భటులు. అత్యంత పవిత్రంగా భావించే పోలీసు దుస్తుల్లో కీచక పర్యాన్ని సాగిస్తున్నారు. తనకు న్యాయం చేయమని కోరి వచ్చిన మహిళల్ని, అమ్మాయిల్ని చెర పట్టేందుకు ప్రయత్నించి.. వివాదాల్లో చిక్కుకుపోవడంతో పాటు ఉద్యోగాలకు చేజేతులారా ఎసరు పెట్టుకుంటున్నారు. తాజాగా మియాపూర్ ఎస్సై ఓ మహిళ విషయంలో చెత్త పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.

2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్ కుమార్ .. మియాపూర్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో బ్యూటీషియన్‍గా పనిచేస్తున్న ఓ మహిళ చీటింగ్ కేసు విషయంలో కంప్లైంట్ చేశారు. తన స్నేహితుడు బిజినెస్ పేరుతో సుమారు రూ. 6 లక్షలు మోసం చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్సై.. విచారణ చేపట్టారు. సదరు వ్యక్తిని విచారణకు పిలిపించి.. అతని వద్ద నుండి డబ్బులు రికవరీ చేయించి  ఆమెకు అందించాడు. కేసు క్లోజ్ అయినప్పటికీ.. ఆమె ఫోన్ తీసుకుని మహిళలకు నిత్యం ఫోన్ చేసి వేధించేవాడు. ఆమె వెంట పడి.. అసభ్యంగా ప్రవర్తించాడు. మేసేజ్ లు చేసి చిరాకు తెప్పించేవాడు.

రోజు రోజుకూ అతడి వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక..నేరుగా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. సీపీ అవినాష్ మహంతి విచారణకు ఆదేశించగా.. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఎస్సై గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతా యుతంగా ఉండాల్సిన ఓ ఎస్సై పోకిరీలా మారి, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాల్నే హింసకు గురి చేశాడు. దీంతో ఆమె నేరుగా సీపీని ఆశ్రయించింది. దీంతో మియాపూర్ ఎస్సైపై వేటు పడింది. ఇలాంటి కొంత మంది చీడ పురుగులు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది అనడంలో సందేహం లేదు. మరీ మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments