Dharani
హైదరాబాద్‌లో వరుసగా షాపింగ్ కాంప్లెక్స్, భారీ దుకాణాలు అద్దాలు పగులుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దాంతో నగరవాసులు భయపడిపోతున్నారు. అసలేం జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పనులు చేస్తుంది ఎవరు.. ఎందుకు చేస్తున్నారం వంటి వివరాలు..
హైదరాబాద్‌లో వరుసగా షాపింగ్ కాంప్లెక్స్, భారీ దుకాణాలు అద్దాలు పగులుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దాంతో నగరవాసులు భయపడిపోతున్నారు. అసలేం జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పనులు చేస్తుంది ఎవరు.. ఎందుకు చేస్తున్నారం వంటి వివరాలు..
Dharani
అప్పుడప్పుడు మన చుట్టూ చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. కారణం గురించి కూడా ఆలోచించలేనంతగా భయపడి పోతుంటాం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి. ఇళ్ల ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు.. ఊరిలో ఉన్నట్లుండి మంటలు చెలరేగడం వంటి సంఘటనలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సంఘటనలు జనాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తాయి. అసలు కారణం ఆలోచించే వ్యవధి లేకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
అయితే ఈలాంటి సంఘటనలు కేవలం పల్లెల్లో మాత్రమే జరుగుతాయి అనుకుంటే పొరపాటే. నగరం నడిబొడ్డున కూడా ఈ తరహా ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు.. నగరవాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలేం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా అద్దాలు పగులుతున్న ఘటనలు జనాలు భయపెడుతున్నాయి. ఆ వివరాలు..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో ప్రాంతాల్లో వరుసగా అద్దాలు పగులుతున్న ఘటనలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే ఇది ఆకతాయిల పని అంటున్నారు. నిందితులు షాపింగ్ కాంప్లెక్స్ అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. దాంతో ఆయా దుకాణాల నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. కావాలనే ఇలా చేస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు. వరుసగా నెల రోజుల నుంచి చోటు చేసుకుంటున్న ఈ ఘటనలపై పోలీసులు ఒకేసారి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షాప్ యజమానుల ఫిర్యాదుల మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. గత నెల 20న రాత్రి 7 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని బ్రూక్స్ బ్రదర్ స్టోర్ అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. ఆ తర్వాత గంట వ్యవధిలోనే పక్కనే ఉన్న వాన్ హుస్సేన్ స్టోర్ అద్దాలు, వైట్ క్రో స్టోర్ అద్దాలు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ 24 సెవన్ గ్రాసరీ స్టోర్‌కు సంబంధించిన అద్దాలు పగిలిపోయాయి. దాంతో దుకాణాల్లో గాజు ముక్కలు దర్శనం ఇచ్చాయి. వీటిని చూసిన కొనుగోలుదారులు భయాందోళనకు గురయ్యారు.
ఇక ఈ అద్దాల ధ్వంసం ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు తెలిసింది. మరుసటి రోజు అనగా మార్చి 21 రాత్రి పూటి ఇదే సంఘటనలు మళ్లీ పునరావృతం అయ్యాయి. ఈసారి రోడ్‌నంబరు 2లోని ఆర్‌కే సినీప్లెక్స్(పీవీఆర్ మాల్)లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా ఈ మాల్‌లో రెండుసార్లు ఇదే ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల విరామం తర్వాత.. ఈనెల 4 రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని సూర్య సిల్క్ టెక్స్ క్రియేషన్ స్టోర్ అద్దాలు, 5న రాత్రి స్థానిక అండర్ ఆర్మర్ స్టోర్‌లోని అద్దాలపైకి రాళ్లు రువ్వడంతో అవి పగిలి ముక్కలయ్యాయి.
ఇలా నగరంలో వరుసగా పదికిపైగా అద్దాలు పగిలిన సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. దాంతో భయందోళనకు గురైన ఆయా స్టోర్ల మేనేజర్లు ఈనెల 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై 8 కేసులు నమోదు చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో స్టోర్స్ మీద దాడి చేశారనే అనుమానంతో ఇప్పటికే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తైతే.. అసలు నిందితులు ఎవరో తెలియనుంది.