iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే కొత్త కార్డుల జారీ

Telangana New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల నుంచే కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

Telangana New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల నుంచే కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే కొత్త కార్డుల జారీ

ప్రభుత్వాలు జారీ చేసే రేషన్ కార్డుల ద్వారా ప్రజలు చాలా ప్రయోజనాలు పొందుతుంటారు. రేషన్ సరుకులతో పాటు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందటానికి రేషన్ కార్డులు ఉపయోగపడతాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రేషన్ కార్డులు లేక చాలా మంది నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. ఇలాంటి వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించినప్పటికీ వాటిని ఇవ్వలేదు.

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రేషన్ కార్డులు లేనివారికి కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వచ్చే నెల అంటే అక్టోబర్ నుంచే న్యూ రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో ఏళ్లతరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించనుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ కార్డుల జారీ విషయంలో రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇదివరకే కొత్త రేషన్ కార్డుల జారీపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సెప్టెంబర్ 16న కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హులు, విధివిధానాలను రూపొందించి త్వరలోనే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి ప్రకటనతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.