P Venkatesh
తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు దారలకు గుడ్ న్యూస్. సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. ఎప్పటి నుంచి సన్న బియ్యం పంపీణీ చేయనున్నారంటే?
తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు దారలకు గుడ్ న్యూస్. సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. ఎప్పటి నుంచి సన్న బియ్యం పంపీణీ చేయనున్నారంటే?
P Venkatesh
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నది. త్వరలోనే రైతులకు రైతు భరోసా కూడా అందించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజాపాలనలో కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. కొత్త రేషన్ కార్డులు సైతం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీనిపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సన్నబియ్యం పంపిణీ చేస్తే రేషన్ బియ్యం పక్కదారి పట్టదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీపై గుడ్ న్యూస్ అందించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు.
పౌరసరఫరాలశాఖకు సంబంధించిన కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. నాణ్యమైన బియ్యం వినియోగదారులకు అందించడం మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. అవసరమైన చోట రాయితీ ధరలకు గోధుమలు కూడా సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. పీడీఎస్ బియ్యం దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.