iDreamPost
android-app
ios-app

రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు! ఏంటంటే..

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇక రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతు భరోసా స్కీమ్ ఒకటి. తాజాగా ఈ అంశంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇక రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతు భరోసా స్కీమ్ ఒకటి. తాజాగా ఈ అంశంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు!  ఏంటంటే..

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల హామీని ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేసే దిశాగా అడుగులు వేస్తుంది. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ..రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ కీలక అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు అందించే ఆర్థిక సాయంపై తరచూ కీలక విషయాలను వెల్లడిస్తుంది. తాజాగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా అమలు అంశంపై అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. అందులో భాగంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి పలు స్కీమ్స్ ను అమలు చేస్తుంది. అలానే  మరికొన్ని పథకాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంది. ఇక రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతు భరోసా స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద ఏడాదికి ఏకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అలానే దీనిని అమలు చేసే దిశా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకారకి రూ.10వేలు ఇవ్వగా.. దాన్ని 15వేలకు పెంచి ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.

ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు రైతుభరోసాను అమలు చేయలేదు. గతంలో ఒకసారి పాత నిధులనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అకౌంట్ లోకి జమ చేసింది. ఇప్పుడు మరో విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.  ఈసారి పెంచిన డబ్బులను జమ చేస్తారా అని రైతులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే రైతుభరోసా స్కీమ్ అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ..అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో వ్యవసాయ శాఖ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త మార్గదర్శకాలతో రైతు భరో అమలు చేసేందుకు సిద్ధం అవ్వాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే రైతుల నుంచి అభిప్రాయాలను  తీసుకోవాలని సూచనలు చేశారు. కేవలం సాగు చేసే భూములకే పంట సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి తుమ్మల ఆదేశాలతో రాష్ట్రంలోని 110 నియోజకవర్గాల్లోని రైతుల వేదికలను ఏర్పాటు చేసి.. అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి రైతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ పనులను వ్యవసాయ అధికారులకు అప్పగించాలని మంత్రి తుమ్మల సూచనలు చేశారు. ఆ తర్వాత ఆ ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వానికి అందించాలని చెప్పారు. కేవలం సాగు చేసే పొలాలకే పెట్టుబడి సాయం అందించాలనీ.. దీనికి అనుగుణంగా విధివిధానాలను ఖరారు చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. దీంతో త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని పలువురు రైతులు అభిప్రాయా పడుతున్నారు.