P Krishna
Minister Sitakka: హైదరాబాద్ లో ‘హైడ్రా’ దూకుడు పెంచింది. భూ కబ్జాలు చేసి అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారికి నోటీస్ ఇస్తూ కూల్చివేస్తున్నారు.
Minister Sitakka: హైదరాబాద్ లో ‘హైడ్రా’ దూకుడు పెంచింది. భూ కబ్జాలు చేసి అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారికి నోటీస్ ఇస్తూ కూల్చివేస్తున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు మరికొన్ని పథకాలు అమలు చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వరదల నుంచి శాశ్వత విముక్తి చేయాలని ‘హైడ్రా’ ను రంగంలోకి దింపారు. హైడ్రా కూల్చివేతలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.
తెలంగాణ వ్యాప్తంగా నాళాలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టడాలు నిర్మించిన వారి వెన్నుల్లో వణుకు మొదలైంది. ఏ క్షణంలో కూల్చివేస్తారో అని భయం పట్టుకుంది. పేదల ఇండ్లు కూల్చివేస్తున్నారు.. వారు దిక్కు మొక్కు లేక రోడ్డున పడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. హైడ్రా కూల్చి వేతలపై ప్రతిపక్ష నేతల విమర్శలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ పాపాలను తమ ప్రభుత్వం కడిగివేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వంలో అధికార ధీమాతో కబ్జాదారులు తాంబాలంలా ఉన్న చెరువులను చెంబుల్లా మార్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాల చౌకబారు విమ్శలు మానుకోవాలని అన్నారు. హైడ్రా పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పపడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమర్ధవంతమైన అధికారి.. ఆయన చేస్తున్న పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేయాలని, అక్రమాలను కూల్చివేయాలను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు మంత్రి సీతక్క.