P Venkatesh
నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆ శాఖలో 14 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే వాటి భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించింది.
నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆ శాఖలో 14 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే వాటి భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించింది.
P Venkatesh
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. త్వరలోనే పలు శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ విషయమై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆ శాఖలో 14 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. మంత్రి సీతక్క ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కొంత ఆలస్యం చేయడం, పరీక్షా పేపర్లు లీక్ అవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇప్పుడ ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నిరుద్యోగులకు శుభవార్తను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
సోమవారం మంత్రి సీతక్క ములుగులో పర్యటించారు. ఈ సందర్భంగా ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రకియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవల 1890 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి కూడా తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.