మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క.. రేపు మరో రెండు గ్యారెంటీలు!

తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించబోతోంది. ఫిబ్రవరి 2న ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించబోతోంది. ఫిబ్రవరి 2న ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రజా పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి ఆరుగ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రెండు గ్యారెంటీలను అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క మహిళలకు గడ్ న్యూస్ అందించారు. రేపే అనగా(ఫిబ్రవరి02)న మరో రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

కాగా మహిళలకోసం మహాలక్ష్మీ పథకం ప్రారంభించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంచింది. ఇప్పుడు మహిళలకు ప్రతి నెల 2500, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. కాగా కేస్లాపూర్‌ నాగోబా ఆలయం నుంచి రెండు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. మంత్రి ప్రకటనతో రేపు సీఎం రేవంత్ ప్రకటించబోయే గ్యారెంటీలపై ఆసక్తి నెలకొంది.

ఇక తెలంగాణ సర్కార్ ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభుత్వం అందించే పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో మహిళలకు ప్రతినెల 2,500 ఇచ్చే పథకానికి ప్రజాపాలనలో 92.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా 500కే గ్యాస్‌ సిలిండర్‌ కోసం 91.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు హామీలను నెరవేర్చితే మహాలక్ష్మీ పథకం పూర్తవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీటి అమలు కోసం ఎంతమొత్తంలో ఖర్చు అవుతుంది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత అనే వివరాలను సేకరించిన తర్వాత ఈ గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి రేపు సీఎం రేవంత్ కేస్లాపూర్ లో ప్రకటించబోయే హామీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments