రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు!

Minister Ponnams Key Comments: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికల జరగబోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు పోటా పోటీగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Ponnams Key Comments: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికల జరగబోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు పోటా పోటీగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది చివరల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో మహాలక్ష్మీ స్కీమ్, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఈ ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఆరు గ్యారెంటీ పథాకల్లో మహాలక్ష్మి స్కీమ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. అంతేకాదు రెండు నెలల క్రితం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించారు. తాజాగా రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు నువ్వా నేనా అంటూ పోటా పొటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. తమ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ప్రచారం చేస్తున్న సమయంలో కేబీ కాలనీలో ఇళ్లు లేని వారికి మొదట ఇళ్లు మంజూరు చేస్తాం. ఇక్కడ ఇళ్లు చూసి చాలా బాధ వేసింది.. అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడాను. మాజీ సీఎం పదేళ్లు అధికారంలో ఉండి రెండు వేల పెన్షన్ మాత్రమే ఇచ్చారు’ అని అన్నారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబులు దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిందా? దళిత బంధు ఎంతమందికి వచ్చింది? ఉద్యోగాలు వచ్చాయా? రుణమాఫీ ఊసే లేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. త్వరలో మిగిలిన హామీలు కూడా నెరవేర్చి తీరుతుంది. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తాం. ప్రస్తుతం ఉన్న పెన్షన్లు 4 వేలకు పెంచుతాం. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన మహిళలకు రూ.2500 ఇస్తాం అని అన్నారు.  ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవొద్దని.. ప్రజా పక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు.

 

Show comments