iDreamPost
android-app
ios-app

వారికి గుడ్ న్యూస్.. TSRTCలో కారుణ్య నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

TSRTC compassionate appointments: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్తను అందించింది.

TSRTC compassionate appointments: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్తను అందించింది.

వారికి గుడ్ న్యూస్.. TSRTCలో కారుణ్య నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై దృష్టిసారించింది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీలో పారదర్శకత వహించాలని, అవకతవకలు లేకుండా చూడాలని సూచించిన విషయం తెలిసిందే. త్వరలో మెగా డీఎస్సీతో పాటు భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్తను అందించింది. కారుణ్య నియామకాల భర్తీపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.

టీఎస్‌ఆర్టీసీలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాలు కల్పిస్తారు. కాగా పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాల కోసం వేచిచూసే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి ప్రక్రియ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామ‌కాలు), మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హత‌లను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద హైద‌రాబాద్ రీజియన్‌ పరిధిలో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, న‌ల్గొండ 56, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 83, మెద‌క్ 93, వ‌రంగ‌ల్ 99, ఖ‌మ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, క‌రీంన‌గ‌ర్‌ రీజియన్‌లో 45.. మొత్తం 813 కండ‌క్టర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కారుణ్య నియామకాల కోసం చూస్తున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను అధికారం చేపట్టిన నెలకే భర్తీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మరి టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాల భర్తీ చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.