iDreamPost
android-app
ios-app

Telangana: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ శుభవార్త.. జులై నుంచి ఇక ఆ బాధ ఉండదు!

  • Published Mar 25, 2024 | 1:25 PM Updated Updated Mar 25, 2024 | 1:25 PM

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తమ సత్తా చూపిస్తూ ప్రజలకు కావాల్సిన వసతులను సమకూర్చుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తమ సత్తా చూపిస్తూ ప్రజలకు కావాల్సిన వసతులను సమకూర్చుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది.

  • Published Mar 25, 2024 | 1:25 PMUpdated Mar 25, 2024 | 1:25 PM
Telangana: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ శుభవార్త.. జులై నుంచి ఇక ఆ బాధ ఉండదు!

తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించని ఎన్నో పథకాలను ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో .. మంత్రి శ్రీధర్‌బాబుకు సత్కార సభ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ప్రజలకు మరో శుభవార్తను తెలియజేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రొఫైల్ ను తయారు చేస్తున్నామని వెల్లడించారు. ఇకపై రాష్ట్రంలో ఏ వైద్యుడిని సంప్రదించినా ప్రజల .. ఆరోగ్య సమస్యలను తెలుసుకునే విధంగా .. ప్రజలకు మెరుగైన చికిత్సను చేపట్టే విధంగా ఇది ఉండబోతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీధర్ బాబు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ గురించి చెబుతూ.. ఆధార్ కార్డు తరహాలో.. అందరికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో ఓ గుర్తింపు కార్డును అందిస్తామని ప్రకటించారు. ఆయా వ్యక్తుల పేర్లను టైప్ చేస్తే .. వెంటనే వారికీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందుబాటులోకి వచ్చేలా.. ఈ కొత్త స్కీమ్ ఉండబోతున్నట్లు తెలియజేశారు. వచ్చే జూలై నుంచి ఈ హెల్త్ కార్డ్స్ అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపడతాం అని.. శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే, ప్రజల అభివృద్ధి కోసం , ప్రజలంతా గర్వించేలా పనిచేస్తాం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల క్వార్టర్లలోని డిస్పెన్సరీలతోపాటు .. అన్ని హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కు తగినట్లుగా.. మందులను సరఫరా చేయాలంటూ.. మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా చూస్తాం అంటూ.. మంత్రి హామీ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం శ్రీధర్‌బాబు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ ప్రస్తావన గురించి చెబుతూ.. తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని.. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు పూర్తయిందని.. ఇన్నేళ్ల తన రాజాకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు.. అండగా సేవలు అందిస్తునంటూ తెలియజేశారు. అలాగే, గత బీఆర్ఎస్‌ పాలనలో తనకు గన్‌మెన్‌ను తొలగించినా.. భయపెట్టే ప్రయత్నం చేసినా.. ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదని, హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ వ్యక్తిగానే పనిచేశాననంటూ చెప్పుకొచ్చారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు .. రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడంతో.. అక్కడి వారంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.